యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా( Devara Movie ) యొక్క షూటింగ్ కార్యక్రమాలు హడావుడిగా సాగుతున్నాయి.ఈ సినిమా యొక్క విడుదల తేదీ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.
మరో వైపు సినిమా యొక్క షూటింగ్ కు ఎన్టీఆర్ డెడ్ లైన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.ఎన్టీఆర్ తదుపరి సినిమా హిందీ లో వార్ 2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.
అందుకే దేవర సినిమా షూటింగ్ ను స్పీడ్ గా జరపాలని భావిస్తున్నారు.

ఈ సినిమా లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందే.పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తూనే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా జాన్వీ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమా కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.హీరోయిన్ గా జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్ పాత్రకు గాను శ్రీ లీల( Sreeleela ) కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

శ్రీ లీల కు ఎన్టీఆర్ కు ఒక పాట కూడా ఉంటుందట.ఇక ఐటం సాంగ్( Item Song ) కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయట.మొత్తానికి ఎన్టీఆర్ దేవర సినిమా ను ముద్దుగుమ్మలతో ముంచెత్తుతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఆకట్టుకునే అందంతో పాటు ముద్దుగుమ్మలు సినిమాలో మాస్ ఆడియన్స్ కోసం కవ్వించే అందాలను చూపించబోతున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దేవర సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఎన్టీఆర్ కోసం ఈ సినిమా లో అత్యంత విభిన్నమైన పాత్ర ను కొరటాల శివ డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.
కొరటాల శివ గత చిత్రం తాలూకు ఫలితం ఈ సినిమా పై పడకుండా జాగ్రత్త పడుతున్నారు.