టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ పరశురామ్ ( Parasuram )ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.ఈయన గురించి గత కొద్ది రోజులుగా అల్లు అరవింద్ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే ప్రస్తుతానికి ఈయన పీకల్లోతు కష్టాలలో మునిగిపోయారని తెలుస్తోంది.నాగచైతన్య హీరోగా 14 రీల్స్( 14 Reels ) నుంచి ఓ సినిమా చేయడం కోసం ఆరు కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా తీసుకున్నారట.
అయితే ఈ సినిమా కోసం నాగచైతన్య ( Nagachaitanya )ఇతర ప్రాజెక్టు కూడా ఒప్పుకోలేదని తెలుస్తుంది.

ఈ విధంగా ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు అయితే ఆ క్షణమే డైరెక్టర్ పరశురామ్ కి స్టార్ హీరో అయినటువంటి మహేష్ బాబు( Mahesh Babu )తో సినిమా చేసే అవకాశం రావడంతో ఈ సినిమాకు కమిట్ అవుతూ నాగచైతన్య సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు.ఇలా ఈ సినిమా ఆగిపోవడంతో నిర్మాతలు కూడా నష్టపోయారని తెలుస్తోంది.అయితే ఇంటర్వ్యూలలో నాగచైతన్య కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ డైరెక్టర్ పరశురామ్ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అంటూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

తాజాగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ డైరెక్టర్ పరశురామ్ కి.గట్టి షాక్ ఇచ్చింది చెప్పాలి.గతంలో తమ నిర్మాణ సంస్థ నుంచి ఆయన అడ్వాన్స్ గా తీసుకున్నటువంటి ఆరు కోట్ల రూపాయలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని చెప్పారట ఇలా ఆరు కోట్లకు వడ్డీ 7 కోట్లు కావడం గమనార్హం ఇలా దాదాపు 13 కోట్ల రూపాయలను ఈయన 14 రీల్స్ వారికి కట్టాల్సిన డబ్బు విషయంలో పరశురామ్ కి మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు( Dil Raju ) సహాయం చేశారని తెలుస్తోంది అయితే ఈయన డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.మొత్తానికి 6 కోట్లకు 7 కోట్లు వడ్డీ కట్టి భారీ నష్టాన్ని మిగుల్చుకున్నాడు పరుశురాం.
దీంతో టాలీవుడ్ లో అంతా పరుశురాం గురించే చర్చించుకుంటున్నారు.







