ఎస్.జె.సూర్య( SJ Surya ) గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు దర్శకుడిగా వ్యవహరించిన సూర్య ప్రస్తుతం హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాకు దర్శకత్వం వహించారు సూర్య.ఈ క్రమంలోనే ఎస్.జె.సూర్య తాజాగా నటించిన చిత్రం బొమ్మై.( Bommai Movie ) ఇందులో ప్రియా భవాని శంకర్( Priya Bhavani Shankar ) హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ అలాగే సూర్య ఇద్దరూ కలిసి లిప్ లాక్ సీన్ లో నటించగా ఆ విషయం గురించి ప్రస్తుతం కోలీవుడ్ లో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలోని లిప్‌లాక్ సన్నివేశం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది.అయితే ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో సంప్రదాయబద్ధంగా కనిపించే ప్రియ భవానీ,ఇందులో మాత్రం లిప్‌లాక్ సీన్లలో నటించడం ఆమె అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, ప్రియభవానీ, చాందినీ తమిళరసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.
యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
బొమ్మలపై అమితమైన ఇష్టంతో ఉండే హీరో.ఆ బొమ్మలకు ఏమైనా జరిగితే తట్టుకోలేనన్న ఊహాజనిత లోకంలో జీవిస్తుంటాడు.అలా ఒకానొక సందర్భంలో తన హద్దు దాటిపోతాడు.
తద్వారా జరిగే విపరీత పరిణామాలు ఏంటన్నదే ఈ చిత్ర కథ.ఈ ట్రైలర్‌లో ప్రియ భవానీ శంకర్ లిప్‌లాక్ సన్నివేశంలో రెచ్చిపోయింది.కాగా వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల వాయిదా పడుతూనే వస్తోంది.
అయితే ఎట్టకేలకు జూన్ 16న ఈ చిత్రానికి మోక్షం లభించనుంది.మాన్‌స్టర్ వంటి హిట్ చిత్రం తర్వాత ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్ మరోసారి ఇందులో జంటగా నటించారు.ఎస్.
చంద్రప్రకాష్ జైన్ ఆశీస్సులతో ఎస్.జె.సూర్య సమర్పణలో ఏంజెల్ స్టూడియోస్, ఎంహెచ్ ఎల్‌ఎల్‌పీ బ్యానరుపై నిర్మాతలు డాక్టర్ వి.మరుదు పాండ్యన్, డాక్టర్ జాస్మిన్ సంతోష్, డాక్టర్ దీపా టి.దురై నిర్మించారు.