ఏపీలో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సరికాదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.వైసీపీ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు.
సీఎం జగన్ సొంత జిల్లాలోనే శాంతి భద్రతలు లేవని అచ్చెన్నాయుడు విమర్శించారు.కడప జిల్లా టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డిపై దాడి చేశారన్న ఆయన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జయరామిరెడ్డికి ఏదైనా జరిగితే జగన్ దే బాధ్యతని తెలిపారు.







