నితిన్ - వెంకీ కుడుముల మూవీలో కృతి శెట్టి.. నిజమేనా?

”VNRTrio”.అనౌన్స్ మెంట్ వీడియో తోనే రచ్చ రచ్చ చేసిన ఈ కాంబో అంచనాలు బాగా క్రియేట్ చేసుకుంది.

 Venky Kudumula Vnrtrio Latest Update Details, #vnrtrio, Venky Kudumula, Nithiin,-TeluguStop.com

ఆ తర్వాత కొద్దీ గ్యాప్ తోనే మెగాస్టార్ చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్ చేసుకున్న ఈ సినిమా షూట్ జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది.డైరెక్టర్ వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నితిన్ హీరోగా నటిస్తున్నారు.

ఇది భీష్మ కాంబో అని తెలిసిందే.వెంకీ కుడుముల ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో రష్మిక మందన్న( Rashmika Mandanna ) నే హీరోయిన్ గా నటించింది.

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి కూడా ఈ భామనే ఎంపిక చేసుకున్నాడు.ఛలో, భీష్మ సినిమాలతో వరుసగా రెండు హిట్స్ అందుకుని ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వెంకీ ఇప్పుడు మూడవ సినిమాను మరింత కసిగా తెరకెక్కిస్తున్నాడు.

మూడేళ్ళ పాటు గ్యాప్ తర్వాత వెంకీ మళ్ళీ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి.ఇక తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు రాగ నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాలో కృతి శెట్టి( Krithi Shetty ) కూడా నటించనుంది అని టాక్ వస్తుంది.మరి కృతి శెట్టి ఎలాంటి రోల్ లో కనిపిస్తుందో వేచి చూడాలి.

ఇదిలా ఉండగా కథ విషయానికి వస్తే ఒక నెలలో చనిపోతాను అని తెలుసుకున్న ఒక వ్యక్తి తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు ? ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు అనే దానిపై వెంకీ ఈ సినిమాను ఫన్నీగా తెరకెక్కించ బోతున్నాడు.ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండ గా.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.చూడాలి ఈ కాంబో ఈసారి ఎలా ఉంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube