ఇటీవలే కాలంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే గుణం పూర్తిగా లోపించింది.చిన్న చిన్న మనస్పర్ధలు పెను తుఫానులుగా మారి దారుణమైన హత్యలకు కారణం అవుతున్నాయి.
గతంలో సమస్యలకు పరిష్కారం వెతికేవారు.నేటి తరంలో సమస్యలకు పరిష్కారం హత్యలుగా మారుతున్నాయి.
ఇలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి ప్రతిరోజు భార్యపట్ల రాక్షసుడిలా ప్రవర్తిస్తూ నరకం చూపించేవాడు.ఇక ఆదివారం అర్ధరాత్రి భార్యను హత్య చేసి హార్ట్ ఎటాక్( Heart Attack ) వచ్చి చనిపోయిందని అందర్నీ నమ్మించాడు.
పోలీసులకు సమాచారం అందడంతో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.అవి ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.భద్రాద్రి కొత్తగూడెం( Bhadradri Kothagudem ) జిల్లాలోని సింగరేణి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రవి అలియాస్ శంకర్( Ravi alias Shankar ) అనే వ్యక్తి చర్ల మండలం ప్రగల్లపాడు గ్రామానికి చెందిన సుజాత ( Sujatha ) అనే మహిళను వివాహం చేసుకున్నాడు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం.రవి ఓ యూట్యూబ్ ఛానల్ కు విలేకరిగా పనిచేస్తున్నాడు.
వివాహం అయినప్పటి నుంచి భార్యను వేధించేవాడు.సుజాత భర్త వేధింపులు తట్టుకోలేక పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది.

పంచాయితీ పెద్దలు భార్య ఊరిలోనే ఉండాలని అంటే అంగీకరించి చర్లలోని పశు వైద్యశాల సమీపంలో కుటుంబంతో కలిసి రవి నివాసం ఉంటున్నాడు.అయినా కూడా రవిలో కాస్త కూడా మార్పు రాలేదు.నిత్యం కొడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు.ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి రవి సుజాత లకు మధ్య గొడవ జరిగింది.రవి క్షణికావేశంలో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ నైలాన్ వైరుతో సుజాత మెడకు గట్టిగా లాగి పట్టి హత్య చేశాడు.

ఆ తరువాత సుజాత హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది అంటూ అందరినీ నమ్మించాడు.సుజాత ఒంటిపై గాయాలను గమనించిన బంధువులు రవిని గట్టిగా నిలదీయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.







