వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశపడుతున్న జనసేన పార్టీ( Janasena party ) క్షేత్రస్థాయిలో పార్టీ క్రియాశీలక నిర్మాణంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంది .ముందుగానే పార్టీ పదవులు కేటాయిస్తే వారు అవినీతికి పాల్పడి పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తారు అన్న భయమో లేకపోతే పార్టీ పదవులు కేటాయించిన వారిని తమ వైపు ఆకర్షించి పార్టీ పట్ల ప్రజల్లో చిన్నచూపు వచ్చేలా అధికార పార్టీ వల వస్తుందన్న భయమో గాని పార్టీ పెట్టి పది సంవస్తారాలు అవుతున్నా ఇంతకాలం గ్రామస్థాయి కమిటీ నిర్మాణాలు గానీ బూత్ కమిటీని నిర్మాణాలు గానీ జనసేన పార్టీలో జరగలేదు.
కానీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇప్పుడు జనసేన పార్టీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్లను, కన్వీనర్లను నియమించడం ఆసక్తి కలిగిస్తుంది.
న్యూ సౌత్ వెల్స్, క్వీన్స్ లాండ్ ,విక్టోరియా ,వెస్ట్రన్ ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాలలో పార్టీ కన్వీనర్ల నియామకం చేస్తున్నట్లుగా నాగబాబు ప్రకటించారు.ఇక్కడ ఆంధ్రాలో పదవుల కేటాయిస్తే పార్టీ నిర్మాణం దిశగా బలంగా పనిచేయాలనుకుంటున్న కార్యకర్తలకు పార్టీ నిర్ణయం అంత సంతృప్తిని కలిగించడం లేదని వార్తలు వస్తున్నాయి.జిల్లా ఇన్చార్జిల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మీద నమ్మకంతో జనసేన పార్టీ మీద ఇష్టంతో చాలామంది యువత క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నారు.
పార్టీ అధికారంలోకి వస్తే చాలు తమకు ఎలాంటి పదవులు అక్కర్లేదనుకునే యువత సంఖ్య లక్షల్లో ఉంది.అలాంటి వారిని పట్టించుకోకుండా ఎక్కడో దేశం బయట ఉన్న వారికి పదవులు మీద దృష్టి పెట్టడం పార్టీకి అంత మంచిది కాదని విమర్శలు వస్తున్నాయి.అయితే ప్రవాస ఆంధ్రులకు పదవులు కేటాయించడం ద్వారా వారి నుంచి భారీ స్థాయిలో విరాళాలు కొల్లగొట్టాలనే ఆలోచనతోనే జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది అంటూ అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు ఏది ఏమైనా ఇంట గెలిచాక రచ్చ గెలివా లన్న సామెతకు విరుద్ధంగా ముందురచ్చ గెలవాలని ఆశపడుతున్న జనసేన పార్టీ ఎలాంటి ఫలితాలను అందుకోనందు చూడాలి
.