నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందనే ఆనందాన్ని 9 ఏళ్లలో ఒక్కసారి కూడా కేసీఆర్( CM KCR ) ప్రభుత్వం ప్రజలకు చూపించలేకపోయిందని బీఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి( Priyadarshini Medi ) అన్నారు.సోమవారం నకిరేకల్ పట్టణంలో ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారని,అది ఎందుకు నెరవేర్చలేకపోయారో రాష్ట్రంలో ఉన్న హోంగార్డులకు( Home Guard ) సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
హెూంగార్డులకు ఉద్యోగ భద్రత,ఆరోగ్య భీమా లాంటి సౌకర్యాలు కల్పించి కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కెసిఆర్ మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు.విధి నిర్వహణలో హోంగార్డ్ ఒకవేళ మరణిస్తే కారుణ్య నియామకాలలో వారి కుటుంబ సభ్యులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.
ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్,పదవీ త్యాగం చేసిన డిఎస్పి నళిని,ఆంధ్ర పాలకులను ఎదిరించిన ఏఆర్పిసి శ్రీనివాస్ గౌడ్ ల గురించి ఎవరు మాట్లాడ్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు.వీళ్లు బహుజన బిడ్డలనేనా చిన్న చూపని మండిపడ్డారు.
అట్లనే హోంగార్డుల వేతనాలు, రెక్యులరైజేషన్ ఏమైందని,2012వ సంవత్సరం ఎస్ఐ బ్యాచ్ కు చెందిన వారికి ఎందుకు ప్రమోషన్లు ఇవ్వడం లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.రాష్ట్రంలో పోలీసులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు,డిఏలు సకాలంలో ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో ఇకనైనా చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగులకు ప్రతినెల ఒకటోవ తారీకు జీతాలు ఇచ్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.







