ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే అని చెప్పుకునేవారు.అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా సౌత్ సినిమాలు చాలా అద్భుతంగా ఉండడంతో సౌత్ సినిమాలకు కూడా ఎంతో మంచి క్రేజ్ పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు ( Bolly Wood Star Heroes ) సౌత్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తెలుగు సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ అయితే తెలుగు సినిమాలలో నటించడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే మరొక నటుడు సైతం తనకు తెలుగు తమిళ భాషలలో అవకాశాలు వస్తే నటించాలని ఉంది అంటూ సౌత్ సినిమాలపై తనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, మనసులో మాటను బయటపెట్టారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి షాహిద్ కపూర్ ( Shahid Kapoor ) తాజాగా బ్లడీ డాడీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ సినిమా 2011లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ స్లీప్ లెస్ నైట్ చిత్రానికి అడాప్షన్ గా తెరకెక్కుతుంది.ప్రముఖ ఓటీటీ జియో సినిమాలో ఈ చిత్రం జూన్ 9వ తేదీ రిలీజ్ కాబోతుంది.

ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా షాహిద్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనని యాంకర్ ప్రశ్నిస్తూ మీకు కనుక హాలీవుడ్ ( Holly wood ) సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు షాహిద్ కపూర్ సమాధానం చెబుతూ తాను హాలీవుడ్ సినిమా అవకాశాలు వస్తే ఏ మాత్రం నటించనని తెలిపారు.హాలీవుడ్ సినిమాలలో మనకు ప్రాధాన్యత లేని పాత్రలలో అవకాశాలు కల్పిస్తారు.
అందుకే తాను హాలీవుడ్ సినిమాల కన్నా సౌత్ ఇండస్ట్రీలో ( South Industry ) తెలుగు తమిళ భాషలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని ఈ భాషా చిత్రాలలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉండడంతో తనని తాను నటుడిగా మెరుగుపరుచుకోవడానికి ఈ సినిమాలు చాలా ఉపయోగపడతాయి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







