ప్రముఖ నటుడు సోనూసూద్( Sonusood ) కరోనా సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి సేవా కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.ప్రజల సహకారంతో సోనూసూద్ ఈ కార్యక్రమాలను చేస్తున్నారు.
ఒడిశా రైలు ప్రమాదం గురించి సోనూసూద్ స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఒకింత హాట్ టాపిక్ అవుతున్నాయి.ఒకింత ఘాటుగానే సోనూసూద్ స్పందించి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రైలు ప్రయాణం ప్రమాదంలో( train accident ) వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి.ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ( Odisha train accident )గురించి తెలిసి నా గుండె పగిలిందని సోనూసూద్ తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాలకు సోనూసూద్ సానుభూతిని ప్రకటించారు.ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు అండగా నిలబడాలని అభిమానులకు సోనూసూద్ వెల్లడించారు.
వీడియోలో సోనూసూద్ మాట్లాడుతూ ప్రమాదం గురించి ట్వీట్ చేసి సానుభూతి ప్రకటిస్తామని ఆ తర్వాత పనుల్లో బిజీ అవుతామని చనిపోయిన, గాయాలపాలైన వ్యక్తుల కుటుంబాలను ఎవరూ పట్టించుకోమని ఆయన కామెంట్లు చేశారు.ఉపాధి కోల్పోయిన వ్యక్తుల, కుటుంబాల పరిస్థితి ఏంటని సోనూసూద్ ప్రశ్నించారు.ప్రభుత్వాలు ప్రకటించిన పరిహారం మూడు నెలల్లో ఖర్చవుతుందని ఆయన అన్నారు.
కాళ్లు, చేతులు తెగిపోయిన వాళ్లకు ఈ నష్ట పరిహారం వల్ల న్యాయం జరుగుతుందా? అని సోనూసూద్ కామెంట్లు చేశారు.ఈ తరహా ప్రమాదాలు జరిగిన సమయంలో స్థిరాదాయం కల్పించడం, పెన్షన్ ఇవ్వడం చేయాలని ఈ విధంగా చేయడం ద్వారా ఆ కుటుంబాలకు న్యాయం చేసినట్టు అవుతుందని సోనూసూద్ చెప్పుకొచ్చారు.సోనూసూద్ చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
సోనూసూద్ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి.సోనూసూద్ ఆలోచనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతాయేమో చూడాల్సి ఉంది.