మందుల ధరలు బాగా పెరుగుతున్నాయి.చిన్న ట్యాబ్లెట్ కొనాలన్నా సరే మినిమం రూ.5 నుంచి ఉంటుంది.ఇక పెద్ద పెద్ద జబ్బులకు వాడే శక్తివంతమైన మందులు కొనాలంటే వేలల్లో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఏదైనా పెద్ద జబ్బు వచ్చిందంటే మెడికల్స్‌కు ఎక్కువ డబ్బులు ఖర్చవుతున్నాయి.ఒకవైపు ట్రీట్‌మెంట్‌కు రూ.లక్షల్లో డబ్బులు ఖర్చవుతాయి.ఇలాంటి సమంయలో మళ్లీ మందులు తీసుకోవాలంటే అదనపు భారం పడుతుంది.
ఔషధాల రేట్లు భారీగా పెరుగుతున్నాయి.డిమాండ్ కారణంగా కంపెనీలు ఒక్కసారిగా పెంచేస్తున్నాయి.
ఈ క్రమంలో తక్కువ ధరకు మందులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జనరిక్ మందుల షాపులను అందుబాటులోకి తెచ్చింది.ఈ షాపుల్లో తక్కువ ధరకే పేదలకు ట్యాబ్లెట్లు లభిస్తాయి.
అయితే ఒక యువకుడు సరికొత్త ఆలోచన చేశాడు.తక్కువ ధరకే మందులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
ఇందుకోసం జనరిక్ ఆధార్ అనే కంపెనీని ( Generic Aadhaar )మొదలుపెట్టాడు. మహారాష్ట్రలోని థానేకు( Maharashtra ) చెందిన అర్జున్ పాండే ( Arjun Pandey)అనే యువకుడు ఈ కంపెనీని ప్రారంభించి చవకైనా ధరకే మెడిసిన్స్ అందిస్తున్నాడు.రూ.100 విలువ చేసే మెడిసిన్స్ ను కేవలం రూ.5కే అందిస్తున్నాడు.మారుమూల గ్రామాల్లోనే ప్రజలకు కూడా ఈ కంపెనీ ధర తక్కువ ధరకే మెడిసిన్లు అందిస్తున్నాడు.

కంపెనీకి, ప్రజలకు మధ్య దళారి వ్యవస్థ ఉంటుంది.దీని వల్ల ఏ వస్తువుల ధరలైనా పెరుగుతాయి.అలా కాకుండా నేరుగా కంపెనీ నుంచే ప్రజలకు మెడిసిన్స్ అందేలా మార్కెటింగ్ వ్యవస్ధను రూపొందించుకున్నాడు.దీని వల్ల తక్కువ ధరకే మందులను అందిస్తున్నాడు.డయాబెటిస్ రోగులు ఉపయోగించే గ్లిమిపిరైడ్ స్క్రిఫ్ట్ ధర మార్కెట్ లో రూ.110 ఉంటుంది.అలాగే యాంటీ అలర్జెన్ లెవోసిట్రజిన్ ట్యాబ్లెట్ ధర రూ.55 ఉంటుంది.జనరిక్ మెడికల్ షాపుల్లో గ్లిమిపిరైడ్ మెడిసిన్‌ను కేవలం రూ.5కే ఇస్తున్నాడు.

తక్కువ ధరకే మెడిసిన్స్ అందిస్తుండటంతో ఈ కంపెనీ బాగా పాపులర్ అయింది.దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు ఈ కంపెనీ విస్తరిస్తోంది.టాటా చెర్మన్ రతన్ టాటాను ఇతని ఆలోచన నచ్చింది.దీంతో ఇతని కంపెనీలో రతన్ టాటా పెట్టుబడి పెట్టారు.అతడి కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.దీంతో అతని కంపెనీ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది.
ప్రతి గ్రామానికి తన కంపెనీ వల్ల మందులు సరఫరా చేయాలనేది తన లక్ష్యమని ఈ యువకుడు చెబుతున్నారు.







