టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాగా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఆ సంగతి పక్కన పెడితే.ఉమైర్ సందు( Umair Sandu ) గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలపై ఉన్నవి లేనివి అన్ని కల్పిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు.నోరు విప్పితే హీరోహీరోయిన్లు, దర్శకులు ఇలా సినిమా వాళ్లకి సంబంధించి అక్రమ సంబంధాల పోస్టులు పెడుతూ బాగా ఫేమస్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే ఆయా సెలబ్రిటీల అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేయడంతో పాటు బూతులు మాట్లాడినా కూడా తన వ్యవహార శైలి మాత్రం మార్చుకోవడం లేదు.తరచూ ఏదో ఒక ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తూ తీవ్ర విమర్శలపాలవుతున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై తన అక్కసు వెళ్లగక్కాడు.ఎన్టీఆర్ పై ఒక సంచలన ఆరోపణ చేశాడు.ఎన్టీఆర్‌కి మరో అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ ఉందంటూ పోస్ట్ పెట్టాడు.ఇటీవల ఎన్టీఆర్ మరో అమ్మాయితో దొరికిపోయాడని, అతను ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, ఆయన ఫోన్‌ని భార్య చెక్ చేయగా ఈ విషయం బయటపడిందని తెలిపారు.
అంతేకాదు అందరు హీరోలపై ఆరోపణలు చేశాడు.టాలీవుడ్‌లో ప్రతి ఒక్క నటుడు ఇలాంటి సీక్రెట్ ఎఫైర్స్ కలిగి ఉన్నారని పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ పెద్ద దుమారం రేపుతోంది.ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు.
ఉమైర్ సందుపై ట్రోల్స్, విమర్శల వర్షం కురిపిస్తున్నారు.పచ్చి బూతులు వాడుతూ ఆడుకుంటున్నారు.
వాళ్లింట్లో పనిమనిషిగా చేస్తున్నావా రా? లేక బాత్ రూమ్‌లు కడుగుతున్నావా? ఎన్టీఆర్ ఏంటో మాకు తెలుసు, నువ్వు నీ ఎదవ పోస్ట్ లు ఆపు అని బూతులు తిడుతున్నారు.