రాజమండ్రి వేదికగా ఇటీవల జరిగిన మహానాడు( Mahanadu )లో చంద్రబాబు ప్రకటించిన తొలిదశ మేనిఫెస్టో ప్రకటనలు ఏపీ రాజకీయాలలో ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.మహాశక్తి పేరిట మహిళలకు వరాలు జల్లు కురిపించారు.
డైరెక్ట్ గా డబ్బులు మహిళలు ఎకౌంటులో పడే రీతిలో పలు పథకాలను ప్రకటించటం జరిగింది. 18 ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని.ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
“భవిష్యత్తుకు గ్యారెంటీ“( Bhavishathuku guarentee ) పేరుతో మహానాడులో ఇటీవల ప్రకటించిన తొలి దశ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు( Chandrababu naidu ) బలమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 150 రోజులపాటు “భవిష్యత్తుకు గ్యారెంటీ” పేరిట ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లో తీసుకెళ్లేందుకు జూన్ 10వ తారీఖు నుండి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.ఇందుకోసం నియోజకవర్గ పరిశీలకులతో భేటి కానున్న చంద్రబాబు.“భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం పై చర్చించనున్నారు.ఎన్నికల ముందు చేపట్టబోతున్న ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేసే దిశగా చాలా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది.







