బెల్లం కొండ సురేష్( Bellam konda Suresh ) కొడుకు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellam konda Sai srinivas ) చేసిన మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఆ సినిమా తర్వాత ఆయన చేసిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి మొత్తానికి రాక్షసుడు ( Rakshasudu movie )సినిమహో మంచి హిట్ అందుకున్నాడు…ఇక ఇప్పుడు చేసిన హిందీ ఛత్రపతి( Hindi Chatrapati movie ) సినిమా డిజాస్టర్ అయింది… బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ రెండేళ్ళకి పైగా టైం ని ఒక్క సినిమా కోసమే కేటాయించాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్… హిందీ లో తన సినిమాలకు వచ్చిన సాలిడ్ వ్యూస్ తో స్ట్రైట్ మూవీతో అక్కడ తనకి మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ వివి వినాయక్ తో కలిసి ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయగా సినిమా మాత్రం.
ఆడియన్స్ అంచనాలను అందుకోవడం విషయంలో అత్యంత తీవ్రంగా విఫలం అయ్యింది.దాంతో సినిమా రిజల్ట్ ని చూసి ఒకింత నిరాశ చెందిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా తర్వాత మరో 2 సినిమాలను హిందీ లో రీమేక్ చేయాలని అనుకున్నాడని తెలిసింది అందులో ఒకటి జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన ఆది సినిమా కాగా, రెండోవది పూరీజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి అని తెలుస్తుంది…
కానీ ఛత్రపతి ఇచ్చిన షాక్ తో ప్రస్తుతం సినిమాల రీమేక్ ఆలోచనని కంప్లీట్ గా విరమించుకుని అక్కడ ఒకవేళ ఏదైనా స్ట్రైట్ సబ్జెక్ట్ బాగా ఇంప్రెస్ చేస్తే ఆ సినిమా చేయాలనీ లేదంటే ఎప్పటి లానే తిరిగి తెలుగు సినిమాలే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది… దాంతో ఈ సినిమాతో హిందీ సినిమాల జోలికి ఇక బెల్లంకొండ శ్రీనివాస్ వెళ్ళే అవకాశం చాలా తక్కువే ఉందని అంటున్నారు, తెలుగు మూవీస్ చేసినా హిందీ డబ్బింగ్ రైట్స్ తో బిజినెస్ అయితే అవుతుంది, హిందీ మూవీస్ చేస్తే తెలుగు బిజినెస్ పై ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్ తెలుగు మూవీసే బెటర్ అని బెల్లంకొండ అనుకుంటున్నట్లు సమాచారం.తెలుగు లో ఏ సినిమాతో ఇప్పుడు కంబ్యాక్ ఇస్తాడో చూడాలి…