వైరల్: చిన్నారి ఇంట్లోకి వస్తుండగా గుమ్మం వద్దే దాక్కున్న పాము ఏం చేసిందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఒక్కోసారి చాలా భయానకమైన పరిస్థితుల్ని కల్పిస్తాయి.వామ్మో! మనం అలాంటి స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది? అనే అనుమానం కలగక మానదు.తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించినటువంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియో చూస్తే అందులో కనిపించిన పాప ఎంత అదృష్టవంతురాలో మనకి అర్ధం అవుతుంది.

 Viral What Was The Snake Hiding At The Door While The Child Was Coming Into The-TeluguStop.com

అందుకే మన పెద్దలు అప్పుడప్పుడు అదృష్టం గురించి మాట్లాడుతారు.

అవును, కర్నాటక( Karnataka ) రాష్ట్రంలోని బెళగావి( Belagavi ) జిల్లాలోని హలగా గ్రామంలో ఈ ఘటన వెలుగు చూడగా ప్రస్తుతం ఆ దృశ్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.వీడియోని ఒకసారి పరిశీలిస్తే, చిన్నారి బయట నుండి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.సరిగ్గా అదే సమయానికి ఇంటి గుమ్మం వద్ద ఓ తాచుపాము( Snake ) అక్కడే కాచుకుని ఉంది.

పాప ఆ ప్రమాదకర సర్పాన్ని చూడలేదు పాపం.అలాగే ఇంట్లోకి అడుగుపెట్టేందుకు యత్నించగా పాము తల పైకెత్తి అమ్మాయిని కరిచేందుకు యత్నించింది.

దీంతో పామును చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాలిక, అక్కడి నుంచి పరుగులు తీసింది.దీంతో పెను ప్రమాదం నుంచి బయడపింది.

ఈ ఘటన తాలూకా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా అది కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.ప్రజంట్ పీక్ సమ్మర్ నడుస్తుంది.వేడిమిని తట్టుకోలేని పాములు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి.అందుకే ఈ కాలంలో మరియు వర్షాకాలంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.అవి ఎక్కువగా నీటి మడుగులు, చెట్ల పొదల వంటి ప్రాంతాల్లో సేదతీరుతూ ఉంటాయి.ఆదమరిచి అటుగా అడుగులు వేస్తే ఇక అంతే.

పాము కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube