అన్నమయ్య లో దేవుడి క్యారెక్టర్ కోసం ఆ స్టార్ హీరో అన్ని డబ్బులు అడిగాడా..?

అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) లవర్ బాయ్ క్యారెక్టర్ లో నటిస్తూనే మాస్ చిత్రాలే కాకుండా భక్తిర‌స చిత్రాలలోనూ న‌టించి మంచి విజయాన్ని అందుకున్నాడు.నాగార్జున అన్న‌మయ్య చిత్రం ద్వారా కుటుంబ ప్రేక్షకులకు బాగా ద‌గ్గ‌ర‌ అయ్యాడు.

 Did That Star Hero Ask For All The Money For The Character Of God In Annamayya,-TeluguStop.com

ఈ చిత్రంలో నాగార్జున వెంక‌టేశ్వ‌రు స్వామి భ‌క్తుడు అయిన అన్న‌మ‌య్య పాత్రలో నటించాడు.ఈ క్యారెక్టర్ లో నాగార్జ‌న అద్భుతమైన న‌ట‌న అందరిని ఆకట్టుకుంది.

ఇక ఈ చిత్రంలో వెంక‌టేశ్వ‌రు స్వామి క్యారెక్టర్ లో సుమ‌న్( Suman ) న‌టించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ మూవీలో వెంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర కోసం ముందుగా అనుకున్నది సుమ‌న్ కాదంట.

 Did That Star Hero Ask For All The Money For The Character Of God In Annamayya,-TeluguStop.com

ఈ చిత్రంలో చాలా సన్నివేశాలలో అన్న‌మయ్య స్వామివారి పాదాల పై ప‌డి, మొక్కాల్సి ఉంటుంది.అందువల్ల మొదట్లో వెంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర కోసం సీనియ‌ర్ అగ్ర హీరోను తీసుకోవాల‌ని మూవీ యూనిట్ అనుకుందంట.దాంతో ఈ పాత్ర‌ కోసం సీనియర్ హీరో శోభ‌న్ బాబును( Hero Shobhan Babu ) సంప్రదించారంట.అయితే ఆయ‌న చేయలేనని చెప్ప‌డం ఇష్టం లేక పారితోషికంగా 50 ల‌క్ష‌లు అడిగారంట.

దాంతో మూవీ యూనిట్ స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ను( Nandamuri Balakrishna ) ఈ పాత్ర కోసం అడిగారంట.అయితే స్టార్ హీరో అటువంటి క్యారెక్టర్ లో క‌నిపిస్తే ఫ్యాన్స్ ఎలా స్వీక‌రిస్తారో అనే సందేహంతో దర్శకుడు రాఘ‌వేంద్ర‌రావు అక్కడితో ఆగిపోయారంట.హీరో సుమ‌న్ అయితే వెంక‌టేశ్వ‌ర స్వామి క్యారెక్టర్ కి సెట్ అవుతాడని ఆయ‌న‌ను అడిగారంట.సుమ‌న్ వెంటనే ఒకే చెప్పడంతో ఆయనేనే ఫిక్స్ చేసి, షూటింగ్ పూర్తి చేశారంట.

ఈ చిత్రం అద్బుతమైన విజయాన్ని సాధించింది.ఇక వెంక‌టేశ్వ‌ర స్వామిగా సుమ‌న్ త‌న పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube