రోజురోజుకీ పెరిగిపోతున్న చైనా నిరుద్యోగ యువత రేటు!

అవును, చైనా( China )లో ప్రస్తుతం నిరుద్యోగం రాజ్యమేలుతోంది.అనేక రంగాల్లో దూసుకుపోతున్నామని గప్పాలు చెప్పుకుంటూ తిరిగే చైనా అక్కడ నిరుద్యోగం చూసి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది.

 The Unemployment Rate Of China's Youth Is Increasing Day By Day! Unemployment Ra-TeluguStop.com

ఆ విషయం ఆ దేశం బయటకు చెప్పడానికి సిగ్గుపడినా అక్కడి నివేదికలు బయటకి వచ్చేస్తున్నాయి.తాజాగా అక్కడి యువతలో గరిష్ఠ స్థాయి నిరుద్యోగిత రేటు నమోదయ్యిందనే వార్త ఇపుడు ప్రపంచమంతా పాకేసింది.మునుపెన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లో చైనా యువత నిరుద్యోగిత రేటు 20.4 శాతంగా రికార్డయినట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి.

Telugu China, Chinese, Germany, Hong Kong, International, Japan, Latest, Korea-T

ప్రస్తుత గడ్డు పరిస్థితిలో 16 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారు అక్కడ పనిచేసేందుకు సిద్ధం అయినప్పటికీ పని దొకరకపోవడం గమనార్హం.కొవిడ్‌ ఆంక్షల నుంచి ఇటీవలే బయటకు వచ్చిన చైనాలో.అక్కడి యువతలో నిరుద్యోగానికి సంబంధించి ‘చైనా అకాడమీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ సెక్యూరిటీ( Chinese Academy of Labour and Social Security )’ తాజా నివేదిక వెల్లడించింది.జులైలో చదువు పూర్తిచేసుకున్న కోటి మందికిపైగా పట్టభద్రులు జాబ్‌ మార్కెట్‌లోకి రానుండటంతో ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Telugu China, Chinese, Germany, Hong Kong, International, Japan, Latest, Korea-T

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలతో పోలిస్తే చైనాలో యువత నిరుద్యోగం భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికాలో 2022లో సరాసరి నిరుద్యోగిత 8.1శాతంగా నమోదైతే అంతకుముందు ఏడాది (2021లో) 9.57 శాతంగా నమోదయ్యింది.ఇక 2020లో కరోనా సమయంలో గరిష్ఠంగా 27.4 శాతంగా రికార్డయ్యింది.ఇక హాంకాంగ్‌( Hong Kong ), దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్‌ దేశాల్లో యువత నిరుద్యోగిత రేటు 7 శాతం లోపే ఉండడం విశేషం.అయితే, కొత్తగా జాబ్‌ మార్కెట్‌లోకి వచ్చేవారికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం, అర్హత ఉన్నవారికి వేతనాలు తక్కువగా ఉండటం వంటివి యువ నిరుద్యోగితకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube