నకిలీ వస్తువుల వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు.కాగా వీటిని పసిగట్టే ఫీచర్‌ప్రింట్ అనే యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
యూఎస్-ఆధారిత అలిథియోన్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ ఏఐ, ఫోన్ కెమెరా శక్తిని ఉపయోగించి నకిలీ ఉత్పత్తులను గుర్తిస్తుంది.క్షణాల్లో ఫేక్ ప్రొడక్ట్స్( Fake product ) గురించి తెలియజేస్తుంది.
ఈ యాప్‌తో, యూజర్లు అసలైన, నకిలీ వస్తువుల మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు.
ఫీచర్‌ప్రింట్ యాప్ ఫిజికల్ ప్రొడక్ట్‌పై చిన్న ఉపరితల వివరాలను విశ్లేషించడానికి, వాటిని గణిత సంఖ్యలుగా మార్చడానికి AI టెక్నాలజీ( AI technology)ని ఉపయోగిస్తుంది.
దీనివల్ల ప్రత్యేక సెన్సార్లు లేదా హోలోగ్రామ్‌లు, బార్‌కోడ్‌లు లేదా స్టిక్కర్లను రీడ్ చేయాల్సిన అవసరం ఉండదు.కొన్ని భాగాలు దెబ్బతిన్నా లేదా విరిగిపోయినా, నకిలీ ఉత్పత్తులను గుర్తించడానికి తమ యాప్ నమ్మదగిన పద్ధతిని అందిస్తుందని Alitheon పేర్కొంది.

బంగారం లేదా పురాతన గడియారాలు వంటి ఖరీదైన వస్తువులను అసలైనవిగా గుర్తించడానికి ఇది వ్యాపారాలకు వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.అలా నకిలీ వస్తువుల కారణంగా లక్షలాది రూపాయల నష్టం వ్యాపారులకు వాటిల్లకుండా కాపాడుతుందని వివరించండి.అయితే, ఈ టెక్నాలజీకి లైసెన్స్ అవసరం కాబట్టి, యాప్ పబ్లిక్ యాప్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉండదు.అలిథియోన్( Alitheon ) సంస్థ ఈ యాప్‌ను నేరుగా కంపెనీలకు ఆఫర్ చేస్తుంది.

ఈ వినూత్న ఉపయోగం చాట్‌బాట్‌ల వంటి సాంప్రదాయిక అప్లికేషన్లను మించిపోయింది.దీనితో రియల్-వరల్డ్ సమస్యలను పరిష్కరించవచ్చు.యూజర్లు తమ ఫోన్ కెమెరాతో ప్రొడక్ట్ ఫొటోను క్యాప్చర్ చేయడం ద్వారా, ఆ వస్తువు అసలైనదో లేదా నకిలీదో తెలుసుకోవచ్చు.







