ప్రస్తుత రోజుల్లో ఆత్మహత్య ఘటనలు ఉన్న కొద్ది ఎక్కువై పోతున్న సంగతి తెలిసిందే.క్షణికాలావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు.
చాలామంది బలవన్మరణాలకు దారి తీస్తున్నాయి.పరీక్ష ఫలితాలలో పరాజయం పాలైనందుకు ఇటీవల చాలామంది విధ్యార్దులు మరణించడం జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ( Telugu states )ఇంటర్ మరియు 10వ తరగతి ఫలితాలలో ఫెయిల్ అయిన చాలామంది విద్యార్థులు అవమానాన్ని తట్టుకోలేక… బలవన్మరణాలకు పాల్పడ్డారు.
ఇదే రీతిలో ప్రేమ విఫలమైనందుకు, ఇంకా భార్య భర్తల మధ్య మనస్పర్ధలకు ఒత్తిడి తట్టుకోలేక అవమానాన్ని జయించలేక చాలామంది చనిపోతూ ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్( Hyderabad ) కేబుల్ బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులోకి దూకి యువకుడు ఆత్మహత్య( Suicide ) చేసుకున్నాడు.మృతుడని మాదాపూర్ కు చెందిన వికాస్(24)గా గుర్తించడం జరిగింది.
ఇదిలా ఉంటే నిన్న అతడు కనిపించకుండా పోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో నిన్న రాత్రి వికాస్ బ్రిడ్జి పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.







