ఏపీలో వైసీపీ నాలుగేళ్ల పాలనపై టీడీపీ ఛార్జిషీట్ విడుదల చేసింది.రాష్ట్రంలో ప్రతి రంగాన్ని సీఎం జగన్ నిర్వీర్యం చేశారంటూ టీడీపీ ఛార్జిషీట్ లో పేర్కొంది.
నాలుగేళ్ల జగన్ పాలనలో అన్నీ నేరాలు, ఘోరాలే ఉన్నాయని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ పేరు సీబీఐ ప్రస్తావించినప్పుడే సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలన్నారు వర్ల రామయ్య .వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని నక్కా ఆనందబాబు విమర్శించారు.వైసీపీ పాలనలో బూటకపు సంక్షేమం చేశారన్న ఆయన విశాఖలో రూ.40 వేల కోట్ల భూములు స్వాహా చేశారని ఆరోపించారు.







