జగన్ ప్రభుత్వానికి నాలుగు వసంతాలు పూర్తి.. మొత్తం పూర్తి చేశాం

ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jaganmohan Reddy ) ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నాలుగు సంవత్సరాలు పూర్తయింది.ఈ నాలుగు సంవత్సరాలలో తాము మేనిఫెస్టోలో( manifesto ) పేర్కొన్న 95% అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను అమలు చేసినట్లుగా వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

ఈ నేపథ్యం లో తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం ఈ నాలుగు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెబుతున్న మాటలన్నీ కూడా ఆ వాస్తవాలు అంటూ విమర్శిస్తున్నారు.ప్రతి ప్రభుత్వం మరియు ప్రతిపక్ష మధ్య ఇలాంటి గొడవలు సహజం.కానీ తెలుగు దేశం పార్టీ మరియు వైకాపా నాయకుల మధ్య తార స్థాయికి విభేదాలు చేరుతున్నాయి.

నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వైకాపా ప్రభుత్వం అందుకు సంబంధించిన వేడుకలు నిర్వహించుకుంది.

భారీ ఎత్తున సోషల్ మీడియా లో క్యాంపెయిన్( campaign ) నిర్వహించి తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకుంది.అంతే కాకుండా సంక్షేమ పథకాల గురించి పదే పదే ప్రచారం చేసుకోవడం జరిగింది.మొత్తానికి ఏపీ లో రాబోయే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు( assembly elections ) సంబంధించిన హడావుడి ఇప్పుడే మొదలైంది.

Advertisement

ఎన్నికల మేనిఫెస్టో లో కనీసం సగం హామీలను గతంలో తెలుగు దేశం పార్టీ నెరవేర్చలేదని.కానీ తాము నవరత్నాలు అన్నింటిని పూర్తి చేయడంతో పాటు 95% హామీలను నెరవేర్చడం జరిగిందని.

దేశం లో మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇలాంటి ఘనత సాధ్యం కాలేదని వైకాపా నాయకులు ధీమా తో కామెంట్స్ చేస్తున్నారు.అదే సమయం లో తెలుగు దేశం పార్టీ నాయకులు అంత సీన్ లేదు అంటూ కొట్టి పారేస్తున్నారు.

అసలు విషయం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు అదేనండి ఏపీ ఓటర్ల కు తెలుసు కనుక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో వారే నిర్ణయించుకుంటారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు