సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) ను చంద్రబాబు( Chandrababu naidu ) వెన్నుపోటు పొడిచారని ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు.లక్ష్మీపార్వతి( Lakshmi parvati ) సీనియర్ ఎన్టీఆర్ జీవితంలోకి రావడం వల్లే ఈ విధంగా జరిగిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు.
ఎక్స్ ఐపీఎస్ నరసయ్య( Ex Ips Narasayya ) ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రాజకీయ ప్రత్యర్థులు చెబుతారని ఆయన కామెంట్లు చేశారు.చంద్రబాబు ఎప్పుడూ ఎన్టీఆర్ ను గద్దె దించి సీఎం కావాలని అనుకోలేదని నరసయ్య అన్నారు.ఎన్టీఆర్ గారు 1994 లో సీఎం అయిన సమయంలో లక్ష్మీ పార్వతి సేవ చేయడానికి ఆయన జీవితంలోకి వచ్చానని చెప్పేవారని ఆయన తెలిపారు.
లక్ష్మీపార్వతి రాజకీయంగా ఇన్ ఫ్లూయెన్స్ చేయడంతో పాటు పరిపాలనలో కూడా జోక్యం చేసుకున్నారని ఆయన అన్నారు.
లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ద్వారా పంపిన పేర్లు నచ్చక వేరేవాళ్లను జిల్లాల్లో మార్కెటింగ్ ఛైర్మన్స్ కోసం ఎన్నుకోవడంతో వాళ్లను సస్పెండ్ చేయాలని లక్ష్మీపార్వతి చెప్పేవారని నరసయ్య తెలిపారు.
నా భార్య జోక్యం చేసుకుంటే తప్పేంటి అని ఎన్టీఆర్ చెప్పారని ఆయన కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ ఒక మనిషి కోసం పార్టీని భ్రష్టు పట్టించడంతో చంద్రబాబును సీఎం చేయాలని భావించారని నరసయ్య తెలిపారు.

చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా ఆయనను ఒప్పించడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీని రక్షించారని ఆయన అన్నారు.వైస్రాయి హోటల్ దగ్గరకు లక్ష్మీ పార్వతి వెళ్లడంతో ఆమెపై చెప్పులు వేయగా ఎన్టీఆర్ పై చెప్పులు వేశారని ప్రచారం చేశారని నరసయ్య కామెంట్లు చేశారు.లక్ష్మీపార్వతి లేకపోతే ఈ విధంగా జరిగేది కాదని ఆయన అన్నారు.
ఎక్స్ ఐపీఎస్ నరసయ్య చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







