వచ్చిన దారిని చూసుకోకపోతే ముందున్న దారి ఎలా తెలుస్తుంది... వైరల్ అవుతున్న శేష్ ట్వీట్!

టాలీవుడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన విలక్షణ నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.

 If You Don't Look At The Way You Have Come How Will You Know The Way By Adivi Se-TeluguStop.com

హిట్ 2, మేజర్ ( Major movie )సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శేష్ ప్రస్తుతం గూడచారి2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి పోస్టులు చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే అడివి శేష్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… వచ్చిన దారిని చూసుకోకపోతే ముందున్న దారినీ ఎలా సరిదిద్దుకుంటాం అంటూ అర్థం వచ్చేలా ఒక పోస్ట్ చేశారు.అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇది చూసినటువంటి అభిమానులు నేటిజన్స్ ఒక్కసారిగా తలలు పీక్కుంటున్నారు.అసలు అడివి శేష్ ఈ పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అసలు ఈ ట్వీట్ కు అర్థం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక శేష్ చేసిన ఈ పోస్ట్ పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.ఈ క్రమంలోనే నటుడు రాహుల్ రవీందర్ (Rahul Ravinder) శేష్ పోస్టుపై స్పందిస్తూ…‘శేష్ ఏం చెబుతున్నాడు వెన్నెల కిషోర్.ఏదో రహస్యంగా చెబుతున్నాడు.

కొంపతీసి మనగురించా ఏంటి? అని నటుడు రాహుల్ రవీంద్రన్ కామెంట్ చేయగా.స్పందించిన వెన్నెల కిషోర్(Vennela Kishore) అవన్నీ ట్రాఫిక్​ కోట్స్.

ప్రశాంతంగా ఉండి.కిందకి స్క్రోల్ చేయండి అంటూ బదులిచ్చారు .ఇక ఈ పోస్ట్ పై చిన్మయి(Chinmayi) కూడా స్పందించారు.మహానుభావులు మాట్లాడే మాటలు అసలు అర్థం చేసుకోలేం అంటూ ఈమె ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube