ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు( Senior NTR 100th Birthday ) కావడంతో సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆర్జీవీ మాట్లాడుతూ మీకు ఒక సీరియస్ జోక్ చెప్పడానికి నేను వచ్చానని ఎవ్వరూ నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోందని ఆయన కామెంట్లు చేశారు.
ఆ జోక్ ఎంత పెద్ద జోక్ అంటే స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ నవ్వాలో ఏడవాలో తెలియని జోక్ అని ఆర్జీవీ తెలిపారు.

ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అయిన చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) సీనియర్ ఎన్టీఆర్ ను దారుణంగా టార్చర్ చేయడంతో పాటు ఏడిపించి ఏడిపించి చంపారని ఆయన కామెంట్లు చేశారు.మళ్లీ ఇప్పుడు ఆయనే సీనియర్ ఎన్టీఆర్ కు దండలు వేస్తున్నారని ఆర్జీవీ పేర్కొన్నారు.ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీ పార్వతి( Lakshmi Parvathi ) ఎన్టీఆర్ కు సేవలు చేసినా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి మాయలో పడ్డారని చాలామంది భావిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు అవగాహన లేదా అని సీనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు ఎందుకు దండలు వేస్తున్నారని ఆర్జీవీ అన్నారు.చంద్రబాబును పక్కన కూర్చుని రజనీకాంత్( Rajinikanth ) చంద్రబాబును పొగిడాడంటే ఆయన కూడా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్లే అవుతుందని ఆర్జీవీ కామెంట్లు చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక్ అని తాత మీదున్న గౌరవం వల్లే తారక్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరు కాలేదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో తారక్( Tarak ) కు థ్యాంక్స్ చెబుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.రామ్ గోపాల్ వర్మ కామెంట్ల గురించి టీడీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.దేవినేని నెహ్రూ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో మాట్లాడుతూ ఆర్జీవీ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.








