మన దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్( Most Eligible Bachelors ) లో సల్మాన్ ఖాన్( Salman Khan ) ఒకరనే సంగతి తెలిసిందే.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఈ బాలీవుడ్ హీరోకు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు.
అయితే ఇప్పటికే పలుమార్లు పెళ్లి గురించి స్పందించిన సల్మాన్ తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
నాకు పెళ్లి వయస్సు అయిపోతుందని సల్మాన్ ఖాన్ అన్నారు.
ఇంటర్నేషన్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల( International Indian Film Academy Awards ) ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.ఒక లేడీ ఫ్యాన్ సల్మాన్ కు లవ్ ప్రపోజ్ చేయగా మీరు షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుతున్నారు కదా అని సల్మాన్ అన్నారు.
ఆ తర్వాత ఆ మహిళ తాను సల్మాన్ గురించి మాట్లాడుతున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ ప్రశ్నకు సల్మాన్ స్పందిస్తూ నా పెళ్లి వయస్సు దాటిపోయిందని 20 సంవత్సరాల క్రితం నువ్వు నన్ను కలిసి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ కథల గురించి మాట్లాడిన సల్మాన్ ఖాన్ నా జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అన్నారు.నిజం చెప్పాలంటే నా మాజీ గర్ల్ ఫ్రెండ్స్ అంతా మంచివాళ్లు అని ఆయన అన్నారు.

తప్పంతా నాతోనే అని వాళ్ల వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.నేను సంతోషంగా చూసుకోలేననే భయంతో మాత్రమే వాళ్లు నన్ను వదిలేసి ఉండవచ్చని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.సల్మాన్ ఖాన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సల్మాన్ ఖాన్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.







