బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి ఈ సినిమా తో బాలయ్య కి మంచి హిట్ ఇవ్వబోతున్నాడు… ఇందులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.శ్రీలీల కీలక పాత్రను పోషిస్తుంది.
షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా ప్రేక్షకులం ముందుకు రాబోతోంది.
అలాగే మరోవైపు రవితేజ నటిస్తున్న `టైగర్ నాగేశ్వరరావు`( Tiger Nageswara Rao ) సినిమా కూడా దసరా బరిలోనే దిగబోతోంది.
వంశీకృష్ణ నాయుడు డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్( Abhishek Agarwal ) ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు ఇందులో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది.పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

మొత్తానికి ఈ దసరా పండగకు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు పోటీ పడబోతున్నాయి.అయితే గతంలో బాలకృష్ణ, రవితేజ మధ్య మూడుసార్లు బాక్సాఫీస్ ఫైట్ జరిగింది.మూడు సార్లు రవితేజ గెలవడం…బాలయ్య ఓడిపోవడం జరిగింది.
మొదట బాలయ్య హీరోగా తెరకెక్కిన ఒక్కమగాడు( okkamagadu ), రవితేజ నటించిన కృష్ణ( Krishna ) చిత్రాలు ఒకేసారి విడుదల అయ్యాయి.అయితే ఒక్కమగాడు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిస్తే.
కృష్ణ మూవీ మంచి విజయం సాధించింది.

తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన కిక్( Kick ) మరియు బాలయ్య నటించిన మిత్రుడు చిత్రాలు ఒకేసారి పోటీ పడ్డాయి.కిక్ మంచి విజయం సాధిస్తే.మిత్రుడు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇక 2011లో రవితేజ మిరపకాయ, బాలకృష్ణ పరమవీరచక్ర చిత్రాలు పోటీ పడ్డాయి, పరమవీరచక్ర పరాజయం పాలవ్వగా.మిరపకాయ హిట్ అయింది.
అలా మూడుసార్లు బాలయ్యకు నిరాశే ఎదురైంది.మరి ఈ దసరా పండుగకు మరోసారి పోటీ పడబోతున్న బాలయ్య, రవితేజలలో గెలిచేది ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…
.