ఫోన్ డ్యామ్‌లో పడిందని లక్షల లీటర్లను ఖాళీ చేయించిన అధికారి.. చివరికి షాక్!

ఛత్తీస్‌గఢ్‌( Chhattisgarh )లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.ఒక అధికారి తాను పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి పొందేందుకు దాదాపు డ్యామ్‌లోని నీటినంతటిని ఖాళీ చేశాడు.

 Chhattisgarh Official Drains Reservoir To Find Cellphone He Dropped During Selfi-TeluguStop.com

రాజేష్ విశ్వాస్ అనే వ్యక్తి కంకేర్ జిల్లాలోని కోయిలిబెడ బ్లాక్‌లో ఫుడ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.అయితే ఇటీవల ఈ అధికారి ఖేర్‌కట్టా డ్యామ్ వద్ద వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు వచ్చాడు.

ఆ సమయంలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు అతని స్మార్ట్‌ఫోన్ చేతిలో నుంచి జారి నీటిలో పడిపోయింది.దాంతో రాజేష్ బాగా బాధపడ్డాడు.

తన ఫోన్‌ను తిరిగి పొందాలని నిశ్చయించుకున్న రాజేష్ వరుసగా మూడు రోజుల పాటు డ్యామ్ నుంచి భారీ మొత్తంలో నీటిని బయటకు పంపాడు.మొదట్లో సుమారు 21 లక్షల లీటర్ల నీరు తోడేసాడు.తర్వాత మరొక 20 లక్షల లీటర్ల నీటిని డ్యామ్‌ నుంచి ఖాళీ చేయించాడు.అంటే మొత్తంగా అతను 41 లక్షల లీటర్ల నీరును డ్యామ్‌ నుంచి బయటికి పంపించాడు.

రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.సెల్ఫీ తీసుకునేటప్పుడు ఫోన్( Mobilephone ) జారి నీటిలో పడిపోయింది.

ఫోన్‌ను రికవరీ చేసే ప్రయత్నంలో, రాజేష్ నిబంధనలకు విరుద్ధంగా, అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా మూర్ఖంగా నీటిని డ్యామ్‌ నుంచి బయటికి పంపించాడు.దీని వల్ల గణనీయమైన నీటి నష్టం జరిగింది.

రాజేష్ చర్యలను గుర్తించిన నీటిపారుదల, జలవనరుల శాఖ అధికారి ఫైర్ అయ్యారు.ఈ వ్యవహారంలో ఆ అధికారి జోక్యం చేసుకొని నీటి పారుదల ప్రక్రియకు స్వస్తి పలికారు.అతని దుష్ప్రవర్తన, అనుమతి పొందకుండా తనకు నచ్చినట్లు చేయడం వల్ల పై అధికారులు ఫైర్ అయ్యారు.జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్లా రాజేష్‌ను హస్బెండ్ కూడా చేశారు.

రాజేష్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని, అధిక మొత్తంలో నీటిని బయటికి పంపించాడని సస్పెన్షన్ ఆర్డర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.తన ఫోన్‌లో ఉన్న సున్నితమైన ప్రభుత్వ డేటాను కోల్పోకూడదని డ్యామ్‌ను ఖాళీ చేయించినట్లు రాజేష్ కామెంట్స్ చేశాడు.

అయితే, అతను డ్రెయిన్ చేయడానికి అనుమతించిన నీటిని మించిపోయినట్లు కనుగొనబడింది.అదనంగా, అతని ఫోన్ చాలా రోజులు నీటిలో మునిగిపోయిన తర్వాత అది పని చేయకుండా పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube