నంద్యాల జిల్లా వెలుగోడు మండలం గుంతకందాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది.గ్రామంలోని ఓ వివాహ వేడుకలో భోజనం చేసిన పలువురు అస్వస్థతకు గురయ్యారు.
ఇందులో దాదాపు 20 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను వెలుగోడు, నంద్యాల ఆస్పత్రులకు తరలించారు.
మరోవైపు అధికారులు గ్రామంలో బాధితుల కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటుచేశారు.







