పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawer star Pawan Kalyan ) ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీదనే పెట్టారు.రాజకీయాలకు స్వల్పంగా బ్రేక్ ఇచ్చి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
మరి పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ”ఓజి”( OG movie ) ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Sujeeth ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగి పోయాయి.

ఇక వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచేస్తున్నారు మేకర్స్.ప్రకటించిన కొద్ది రోజులకే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ముంబై, పూణే లలో స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేసారు.ఇప్పుడు రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి కూడా అవుతుంది.
ఈ షెడ్యూల్ కూడా అతి త్వరలోనే పూర్తి కానుంది.

ఇప్పటికే మేకర్స్ పవన్ కళ్యాణ్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేస్తుండగా తాజాగా ఈ సినిమాను మరింత గ్రాండ్ చేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్ రోల్ ప్లే చెయ్యబోతున్నాడు అని టాక్ ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ లో క్రేజీగా మారింది.మరి ఆ హీరో ఎవరై ఉంటారు అనే డీటెయిల్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
మొత్తానికి పవన్ సినిమాలో ఏ బాలీవుడ్ స్టార్ నటిస్తారో వేచి చూడాలి.కాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







