నేడు భారతీయ మార్కెట్లో బడ్జెట్-ఫ్రెండ్లీ కార్లుకు మంచి గిరాకీ ఏర్పడింది.మరీ ముఖ్యంగా రూ.10 లక్షల లోపు కార్లకి మంచి డిమాండ్ వుంది.ఈ నేపథ్యంలోనే ఆయా మోడల్స్ విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు కార్ల తయారీ సంస్థలు యత్నిస్తున్నాయి.త్వరలో భారత మార్కెట్లోకి విడుదలకానున్న రూ.10 లక్షల లోపు కార్లు ఏమిటో ఇప్పుడు చూద్దాము.ఈ లిస్టులో ముందుగా “న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు డిజైర్” గురించి మాట్లాడుకోవాలి.రూ.10 లక్షల లోపు అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో స్విఫ్ట్, డిజైర్ టాప్ లో ఉండడం గమనించవచ్చు.
ఈ రెండు కార్లకు సంబంధించి న్యూ జెనరేషన్ మోడల్స్ 2024 జూన్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.ఆ తరువాత “న్యూ-జెన్ హోండా అమేజ్”( Honda Amaze ) కారకు సంబంధించి థర్డ్ జెనెరేషన్ 2023 చివరలోగా విడుదల కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రస్తుతం ఉన్న PF2 ప్లాట్ఫారమ్ ను మరింత అప్ డేట్ చేసే అవకాశం లేకపోలేదు.2024 ప్రమాణాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లతో దీనిని రూపొందించనున్నారు.ఆ తరువాత “హ్యుందాయ్ ఎక్స్టర్” ( Hyundai Exter ) గురించి చెప్పుకోవాలి.
హ్యుందాయ్ ఎక్సటెర్ SUVని భారత మార్కెట్లోకి జూలై 2023 లో విడుదల చేసే అవకాశం ఉంది.
అదేవిధంగా “టాటా పంచ్, సిట్రోయెన్ C3″లకు మంచి డిమాండు వుంది.వీటి ప్రారంభ ధర దాదాపు రూ.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.ఇక చివరగా “మారుతి సుజుకి”( Maruti Suzuki ) మోడల్స్ గురించి మాట్లాడుకోవాలి.మారుతి సుజుకి-టయోటా JV నుంచి వచ్చే మరో ప్రొడక్ట్ Fronx SUV.2023 ద్వితీయార్ధంలో టయోటా కొత్త ఉత్పత్తిని బయటకు విడుదల చేసే అవకాశం కలదు.ఈ కొత్త కారుకు Taisor అని పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా దీని ధర కూడా పది లక్షల లోపే ఉండనుంది.