వంగ సాగులో లేస్ పురుగుల నివారణ కోసం మెరుగైన సూచనలు..!

వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి( High yield ) సాధించాలంటే చీడపీడల బెడదను సమర్థవంతంగా అరికట్టడమే కీలకం.కాబట్టి వ్యవసాయం చేస్తున్న రైతులు పంట వేసే ముందే పంటను ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయి.

 Better Suggestions For The Prevention Of Lace Bugs In Brinjal Cultivation..! Bri-TeluguStop.com

వాటిని సకాలంలో ఎలా గుర్తించాలి.వాటిని సమర్థవంతంగా ఎలా అరికట్టాలి అనే విషయాలపై తప్పనిసరిగా అవగాహన కల్పించుకుంటేనే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.

కూరగాయలలో ఒకటైన వంగ పంటకు ఆశించే లేస్ పురుగులను ఎలా గుర్తించాలి.ఏ విధంగా అరికట్టి పంటను సంరక్షించుకోవాలి అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.

Telugu Agriculture, Brinjal, Farmers, Yield, Latest Telugu-Latest News - Telugu

వంగ మొక్కలు( Brinjal Cultivation ) మొలకల దశలో ఉన్నప్పటినుంచే ఈ లేస్ పురుగులు పంటను ఆశించడం ప్రారంభిస్తాయి.ఈ పురుగులు గుంపులు గుంపులుగా లేత ఆకుల కింద చేరి ఆకును ఆహారంగా తీసుకుంటాయి.పెద్ద పురుగులు ఆకు కింది భాగంలో గుడ్లను పెట్టి తమ ఆవాసాలను ఏర్పరచుకుంటాయి.ఆకులలో గుండ్రని పారిపోయిన అతుకులు లాగా ఆకు మధ్యభాగం ఏర్పడితే లేస్ పురుగులు పంటను ఆశించినట్టుగా నిర్ధారించుకోవాలి.

ఇంకాస్త ముందుకు వెళ్లి బయట ప్రదేశంలో ఉండే ఆకులు తినడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడతలు పడి చుట్టుకుపోతాయి.చివరికి మొక్కలు చనిపోతాయి. తద్వారా తీవ్ర నష్టం ఎదుర్కోక తప్పదు.

Telugu Agriculture, Brinjal, Farmers, Yield, Latest Telugu-Latest News - Telugu

ఈ లేస్ పురుగుల నివారణ కోసం కీటక నాశక సబ్బులు, పైరిత్రిన్స్, వేప నూనెలతో లేత మొక్కల అడుగుభాగం తడిచేలాగా పిచికారి చేయాలి.అవసరమైతే రసాయన పిచికారి మందులైన మలాథియాన్ లేదా పెరిథ్రోయిడ్ లతో లేత ఆకులపై పిచికారి చేసి ఈ పురుగులను అరికట్టవచ్చు.వీలైనంతవరకు సేంద్రీయ ఎరువులనే( Organic fertilizers ) ఉపయోగించాలి.

రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తే నాణ్యత గల ఆరోగ్యమైన పంటను పొందవచ్చు.కాబట్టి వంగ పంట వేశాక అనుక్షణం ఈ లేస్ పురుగుల ఉనికిని గుర్తించి సకాలంలో అరికట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube