హీరోలను చూసే టికెట్స్ కొంటున్నారు... నటి శ్రీ లీల కామెంట్స్ వైరల్!

రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందD.ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల (Sreeleela) .మొదటి సినిమాతోనే తన అందం అభినయం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం శ్రీ లీల అరడజనుకు పైగా సినిమా అవకాశాలను చేతిలో పెట్టుకొని వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

 Srileela Says Buying Movie Tickets To See Heroes Details, Srileela,ticket, Audi-TeluguStop.com

ధమాకా (Dhamaka) వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని అందుకున్నటువంటి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ సీనియర్ హీరోల సినిమా అవకాశాలను కూడా అందుకొని బిజీగా ఉన్నారు.

Telugu Audience, Srileela, Srileelaticket, Srileela Latest, Ticket, Tollywood-Mo

ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీలీల సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇప్పటికీ కూడా ప్రేక్షకులు(Audience) థియేటర్లకు టికెట్లు(Tickets) కొనుక్కొని వస్తున్నారు అంటే అది కేవలం హీరోలను చూసి మాత్రమేనని హీరోల కోసమే పెద్ద ఎత్తున టికెట్లు కొనుక్కొని థియేటర్లకు వస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.ఇక తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చానని ఇండస్ట్రీలో తనకు మంచి పాత్రలు ఉన్న సినిమా అవకాశాలు వస్తే చాలు.

అలా కాకుండా సినిమా మొత్తం తానే కనిపించాలని కోరుకోను అంటూ ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేశారు.

Telugu Audience, Srileela, Srileelaticket, Srileela Latest, Ticket, Tollywood-Mo

ఇలా హీరోల కోసమే టికెట్లు కొనుక్కొని సినిమాలకు వస్తున్నారంటూ శ్రీ లీల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె ధమాకా సినిమా విజయం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేశారని అర్థమవుతుంది.ధమాకా సినిమాలో శ్రీ లీల పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని ఈ సినిమా సక్సెస్ కు ఈమె కారణమైందంటూ వార్తలు వచ్చాయి.

దీంతో ఈ వార్తలపై ఈమె పరోక్షంగా స్పందిస్తూ ఇలాంటి కామెంట్స్ చేశారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube