మీరు చదువుతున్నది నిజమే… శేఖర్ మాస్టర్( Shekhar master ) హృతిక్ రోషన్ తో కలిసి ఒక పాటలో నటించాడు.అంతేకాదు ఆ పాటలో రెండు కాళ్లు లేని కుంటివాడిగా నటిస్తూ హృతిక్ రోషన్ ( Hrithik Roshan )కి క్రిష్ పాత్రకు మద్దతు పలుకుతూ పాట పాడే సన్నివేశం ఉంటుంది.
ఈ పాటలో హృతిక్ రోషన్ పక్కనే శేఖర్ మాస్టర్ ఉన్న సంగతి మనం చాలా స్పష్టంగా చూడవచ్చు.ఈ పాత యూట్యూబ్ లో కూడా ఉంది.
క్రిష్ 3 సినిమాలో ఈ అరుదైన సంఘటన జరిగింది.మాములుగా తెలుగు చిత్రాల్లో చాల సార్లు పాట మధ్యలో వచ్చి పోయే పాత్రలో శేఖర్ మాస్టర్ చాల సార్లు కనిపించాడు.
కానీ ఒక బాలీవుడ్ చిత్రం కోసం మొదటి సారి అతిధి పాత్రా చేసారు.

ఇక ఈ సినిమాల్లో హృతిక్ రోషన్ మరియు ప్రియాంక చోప్రా ( Priyanka Chopra )ప్రధాన పాత్రల్లో నటించారు.2015లో శ్రీను వైట్ల( Srinu Whitela ) దర్శకత్వంలో వచ్చిన బ్రూస్లీ సినిమాకు మొట్టమొదటి సారిగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.ఆయన ప్రముఖ డాన్స్ మాస్టర్ అయిన రాకేష్ మాస్టర్ దగ్గర చాలా కాలం పని చేశారు.
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఒంటరి గానే సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చాడు.దాదాపు 6 సంవత్సరాలకు పైగా గ్రూప్ డ్యాన్సర్ గా, బ్యాగ్రౌండ్ డాన్సర్ గా పని చేశాడు.
ఆ తర్వాత ఒక 8 సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా కూడా పనిచేయాల్సి వచ్చింది.విజయవాడ నుంచి వచ్చిన శేఖర్ మాస్టర్ దాదాపు ఇప్పటి వరకు 63 సినిమాలకు పైగా పని చేశాడు.
తను రీసెంట్ గా రభస అనే సినిమా కోసం పనిచేశాడు.

కేవలం 8 ఏళ్ల కాలంలో ఇన్ని సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పని చేయడం అనేది మామూలు విషయం ఏమీ కాదు.ఓవైపు సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు డి వంటి షో కి 2009 నుంచి పని చేస్తున్నాడు శేఖర్ మాస్టర్.రెండు సీజన్స్ కి గాను డాన్స్ డైరెక్టర్ గా అలాగే 2014 నుంచి 2020 వరకు జడ్జిగా పనిచేశారు.
అలాగే తాను కొరియోగ్రఫీ చేసిన సినిమాల్లో నాలుగు సినిమాలకు ఫిలింఫేర్ అవార్డు లు, ఒక నంది అవార్డు తో పాటు ఒక సంతోషం ఫిలిం అవార్డు మరియు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు దక్కించుకున్నారు.ఇంకా బోలెడంత కెరీర్ ఉన్న శేఖర్ మరింత పైకి ఎదగాలని కోరుకుందాం.