ఆ విషయంలో హీరోయిన్స్ అందరూ కలసి కట్టుగా ఉండాలి: శృతి హాసన్

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్(Shruthi Hassan) ఒకరు.ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 Shruti Haasan Shocking Comments On Heroines Remuneraion Details, Shruthi Hassan,-TeluguStop.com

ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ గతంలో ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఉండే వ్యత్యాసాల గురించి మాట్లాడిన విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా మరోసారి ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

శృతిహాసన్ తాజాగా జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్(Cannes Film Festival) సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.భారతీయ చిత్ర పరిశ్రమలో వేతన విషయంలో వ్యత్యాసాలు ఉన్నాయా అన్న ప్రశ్న ఈమెకు ఎదురయింది.ఈ ప్రశ్నకు శృతిహాసన్ తనదైన శైలిలో సమాధానం చెప్పడమే కాకుండా తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.

ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే ఈ వ్యత్యాసం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి చోట ఉందని ఈమె తెలియజేశారు.మనమందరం కూడా లింగ సమానత్వం గురించి ఎన్నో కలలు కన్నాము.బాలికల విద్య మహిళల భద్రత వంటి విషయాలన్నీ కూడా పరిష్కరించాల్సి ఉంది అయితే సినిమా రంగంలో ఈ మార్పు ఇప్పుడిప్పుడే మొదలైందని ఈమె తెలియజేశారు.ఒకానొక సమయంలో తాను కూడా తక్కువ రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకొని పనిచేశాను కానీ తాను ఎప్పుడు బాధపడలేదని తెలియజేశారు.

కానీ రెమ్యూనరేషన్ల విషయంలో హీరోయిన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగా శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube