రామ్ సినిమా స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రౌటేలా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ఊర్వశి రౌతెలా( Urvashi Rautela ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రతి సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 If You Know Urvashi Rautela's Remuneration For The Special Song Of Ram ,actress-TeluguStop.com

ఇలా స్పెషల్ సాంగ్స్ ద్వారా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఊర్వశి తాజాగా మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించిన వాల్తేరు వీరయ్యలోని ( Walteru verayya )స్పెషల్ సాంగ్ ద్వారా అందరి సందడి చేశారు.

అదేవిధంగా అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ ( Agent) సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా మెరిసారు.ఇలా ఈ పాటలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.ఇకపోతే తాజాగా ఏమి హీరో రామ్( Ram ) బోయపాటి శ్రీను ( Boyapati Sreenu ) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ హీరోయిన్ శ్రీ లీలా ( Sreeleela ) నటించబోతున్నారు.

సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఊర్వశి భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది.ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ఈమె ఏకంగా రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా ఒక పాటకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube