మాస్ మహారాజా రవితేజ( Ravi teja ) గత రెండు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో చాలా రోజుల తర్వాత వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత మాస్ రాజా నుండి వచ్చిన నెక్స్ట్ మూవీ ”రావణాసుర”( Ravanasura movie ).రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఆశ పడ్డ రవితేజకు మరో ప్లాప్ ఎదురైంది.

ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ప్లాప్ అందుకుంది.పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా తేలేక చేతులెత్తేసింది.ఈ సినిమా మరీ యాక్షన్ ఎక్కువ కావడంతో ఫస్ట్ డే నుండే మిక్సెడ్ టాక్ వచ్చింది.దీంతో మొత్తనికి కలెక్షన్స్ తగ్గిపోయాయి. రావణాసుర సినిమాకు కలెక్షన్స్ రాకపోవడంతో బయ్యర్లు భారీగా లాస్ అయ్యారు.
బిజినెస్ కు తగ్గ వసూళ్లను అందుకోక పోవడంతో భారీ ప్లాప్ గా నిలిచింది.
అయితే తాజాగా రవితేజ ఒక గ్రేట్ మూవీ తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈయన ఈ నష్టాలను తనపై వేసుకుని తన సినిమాతో నష్టపోయిన బయ్యర్లకు ఆ నష్టాలను సెటిల్ చేసి వారికి అండగా నిలబడినట్టు టాక్.
ఇదే నిజం అయితే ఈ సినిమా ప్లాప్ నుండి బయ్యర్లు బయట పడినట్టే అని చెప్పాలి.

ఇక ప్రజెంట్ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు”( Tiger nageshwararao ) షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను డైరెక్టర్ వంశీ ఎక్కడ తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ లుక్ రాబోతుంది.
ఇది ఎలా ఉంటుందో చూడాలి.ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా.
అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.టైగర్ నాగేశ్వరరావు సినిమాను అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.







