వేసవిలో మునగాకును ఇలా తీసుకుంటే అధిక బరువు నుంచి మోకాళ్ల నొప్పుల వరకు అన్ని పరార్!

ప్రస్తుతం వేసవి కాలం జరుగుతున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి.

 Taking Moringa Leaves Like This In Summer Has Many Health Benefits! Moringa Leav-TeluguStop.com

ఎండల‌ దెబ్బకు ప్రజలు బయట కాలు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు.ఇకపోతే ఈ వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని కొన్ని ఆహారాల‌ను తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలి.

అటువంటి ఆహారాల్లో మునగాకు ఒకటి.ముఖ్యంగా మునగాకును ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే అధిక బరువు నుంచి మోకాళ్ళ నొప్పుల వరకు ఎన్నో సమస్యలు పరార్ అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం మునగాకుని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ పెరుగును తీసుకోవాలి.

ఈ పెరుగులో పావు కప్పు ఫ్రెష్ మునగాకు లేదా వ‌న్ టేబుల్ స్పూన్ మున‌గాకు పొడి వేసుకోవాలి.అలాగే అర కప్పు దానిమ్మ గింజలు( Pomegranate ) వేసి బాగా కలిపి నేరుగా తీసుకోవాలి.

ఈ విధంగా ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట లేదా గంటన్నర అనంతరం చేయాలి.ప్రస్తుత వేసవికాలంలో ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మునగాకును ప్రతిరోజూ తీసుకుంటే అతి ఆకలి దూరం అవుతుంది.

క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Tips, Latest, Moringa, Munagaku-Telugu Health

అంతేకాదు మునగాకును పైన చెప్పిన విధంగా తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పు( knee pain )లు దూరం అవుతాయి.ఎముకలు దృఢంగా మారతాయి.నీరసం, అలసట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.రక్తపోటు( Blood pressure ) అదుపులో ఉంటుంది.గుండె పోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.

Telugu Tips, Latest, Moringa, Munagaku-Telugu Health

వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.తలనొప్పి, ఒత్తిడి వంటి వాటి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.బాడీ క్షణాల్లో శక్తివంతంగా మారుతుంది.రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.మరియు మునగాకును పైన చెప్పిన విధంగా తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అదే సమయంలో జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube