తెలుగు చలన చిత్ర పరిశ్రమ( Telugu Film Industry )లో ఎంతో మంది నిర్మాతలు ఉండొచ్చు, కానీ కేవలం కొంతమంది నిర్మాతలు మాత్రమే ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర ని వేస్తారు.ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త నిర్మాతలకు స్ఫూర్తి ప్రధాతలుగా నిలుస్తారు.
అలాంటి మహనుభావులలో ఒకరు స్వర్గీయ శ్రీ రామానాయుడు గారు( Ramanaidu ).నందమూరి తారకరామారావు ని హీరో గా పెట్టి ఆరోజు ‘రాముడు – భీముడు’ అనే చిత్రాన్ని తీసి సెన్సేషన్ సృష్టించాడు.ఆ చిత్రమే ఆయనకీ తొలిసినిమా.ఆ సినిమా తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.మధ్యలో కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాల వల్ల సంపాదించిన డబ్బులు మొత్తం పోయాయి కానీ, ఎప్పటికప్పుడు తెలివిగా వ్యవహరిస్తూ సంక్షోభం నుండి బయటపడి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కేవాడు, అలా ఆయన అప్పటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ మరియు శోభన్ బాబు( Sobhan Babu ) వంటి వారితో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.
ఆ తర్వాత చిరంజీవి , కమల్ హాసన్ వంటి హీరోల దగ్గర నుండి నేటి తరం స్టార్ హీరో అయినా పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేసాడు.ప్రస్తుతం ఆయన స్థాపించిన ‘సురేష్ ప్రొడక్షన్స్'( Suresh Productions ) అనే నిర్మాణ సంస్థ ని నేడు ఆయన తనయుడు సురేష్ బాబు కొనసాగిస్తున్నాడు.భారీ సినిమాలు తియ్యకుండా తక్కువ బడ్జెట్ లోనే క్వాలిటీ సినిమాలను నిర్మించి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంటూ ఆ సంస్థ ని విజయవంతంగా ముందుకు కొనసాగిస్తున్నాడు.
కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా సురేష్ బాబు గొప్పగా రాణించాడు.అయితే గతం లో రామానాయుడు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా( Social Media ) లో వైరల్ గా మారింది.
ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న రామానాయుడు గారు, యాంకర్ అడిగిన ప్రతీ ప్రశ్నకి మనస్ఫూర్తిగా సమాధానం చెప్తూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియా లో సంచలనం గా మారాయి.
మీరు ఇన్ని సినిమాలు తీశారు కదా, మీ మనసుకు బాగా నచ్చిన హీరోయిన్, మీరు మనసుపడ్డ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అని యాంకర్ అడగగా, దానికి రామానాయుడు సమాధానం చెప్తూ ‘మా బ్యానర్ లో ఎక్కువగా వాణిశ్రీ , జయప్రద మరియు శ్రీదేవి( Sridevi ) నటించారు, ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు, ఇండస్ట్రీ లో హీరోయిన్స్ అందరి మీద మనసు పడ్డాను.మనసు పడకపోతే మనం సినిమాలు తియ్యలేము, చక్కగా టైం కి రండి, షూటింగ్ చెయ్యండి, మీ డబ్బులు మీరు తీసుకెళ్లండి అమ్మా అనేవాడిని.అయితే ఆ ముగ్గురు హీరోయిన్స్ తో ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి వాళ్ళ మీద మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే కాస్త ఎక్కువ ఇష్టం మరియు గౌరవం’ అని చెప్పుకొచ్చాడు రామానాయుడు.
ఇక హీరోలలో శోభన్ బాబు తో ఎక్కువ సినిమాలు చేశాను, ఆయన నాకు మంచి ఆప్త మిత్రుడు కూడా అని రామానాయుడు అప్పట్లో చెప్పుకొచ్చాడు.