ఐపీఎల్( IPL ) లో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి.ఈ సీజన్ టైటిల్ కోసం నాలుగు జట్లు ప్లే ఆఫ్( Playoffs ) చేరిన సంగతి తెలిసిందే.
అయితే అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తారని, స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రికార్డు ధర పెట్టి కొనుగోలు చేస్తే చివరికి నిరాశే మిగిలింది.ఫ్రాంచైజీలు పెట్టుకున్న కొండంత నమ్మకాన్ని వమ్ముచేసి దారుణంగా విఫలమైన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్): ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ రికార్డు స్థాయి ధర పలికాడు.పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వేలంలో రూ.18.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.ముంబై- మధ్య జరిగిన మ్యాచ్ లో అర్థ సెంచరీ చేశాడు.13 ఇన్నింగ్స్ లలో 135.96 స్ట్రైక్ రేట్ తో 276 పరుగులు చేశాడు.బౌలింగ్లో 10 వికెట్లు తీశాడు.
ఫ్రాంచైజీ ఇతనిపై పెట్టుకున్న ఆశలను నిరాశ పరిచాడు.

కామెరూన్ గ్రీన్ (ముంబై ఇండియన్స్): ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్( Cameron Green ) ను రూ.17.50 కోట్లు పెట్టి ముంబై ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.ఈ సీజన్ ఆరంభం నుండి పేలవ ఆటను ప్రదర్శించి 13 ఇన్నింగ్స్ లలో 281 పరుగులు చేశాడు.ప్లే ఆఫ్ రేస్ కు చేరే కీలక మ్యాచ్లో 47 బంతుల్లో సెంచరీ చేసి అదరగొట్టాడు.8 వికెట్ల తేడాతో హైదరాబాదును ముంబై చిత్తు చేసి ఓడించింది.

బెన్ స్టోక్ ( చెన్నై సూపర్ కింగ్స్): ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్టొక్ ను రూ.16.25 కోట్లు పెట్టి చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.ఈ సీజన్లో రెండు మ్యాచ్లలో మాత్రమే ఆడాడు.ఈ మ్యాచ్లలో కూడా తన మార్క్ చూపించలేకపోయాడు.గాయం కారణంగా బెంచ్ కు పరిమితమయ్యాడు.
హ్యారీ బ్రూక్ (సన్రైజర్స్ హైదరాబాద్): ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ ను రూ.13.25 కోట్లు పెట్టి హైదరాబాద్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.కోల్ కత్తా – హైదరాబాద్( KKR vs SRH ) మధ్య జరిగిన మ్యాచ్ లో చేసిన సెంచరీ తప్ప ఇన్నింగ్స్ ఆడలేదు.పేలవ ఆట ప్రదర్శించి ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు.







