జగన్ కు ఇంత ఫాలోయింగా ...? 'ట్రెండింగ్ ' అంటే ఇదే !

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి చాలా వరకు సోషల్ మీడియానే కారణం.ఇది జగన్ తో సహా ఆ పార్టీ నాయకులంతా ఒపుకునే నిజం.

  అప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ సోషల్ మీడియా సైనికులు అలుపెరగకుండా తమ రాజకీయ ప్రత్యర్థులపై పోరాటం చేస్తూ ఉండడం వైసిపికి కలిసి వచ్చే అంశాలు అంశాలే.సోషల్ మీడియా( Social media ) లో జగన్ పైన, పార్టీ, ప్రభుత్వం పైన ఎవరు కామెంట్స్ చేసినా,  వాటిని తిప్పికొడుతూ, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపుతూ వైసిపి సోషల్ మీడియా సైనికులు నిరంతరం యుద్ధం చేస్తూనే వస్తున్నారు.

ఇక 2024 ఎన్నికల్లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు సరికొత్త స్లోగన్ ను ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు.ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీ నాటికి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో,  జగన్( YS Jagan Mohan Reddy ) పూర్తిగా పార్టీపై ఫోకస్ చేశారు.

మీడియా సోషల్ మీడియాలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వంటి వాటిపై ప్రచారం నిర్వహించి ప్రజల్లో పార్టీ పైన,  ప్రభుత్వం పైన సానుకూలత ఏర్పడే విధంగా చేసుకోవాలనే విషయంపై దృష్టి సారించారు.

Telugu Ap, Chandrababu, Sajjala Bhargav, Telugudesam, Ysrcp-Telugu Political New

 జగన్ ఆలోచనలకు అనుగుణంగా వైసిపి సోషల్ మీడియా 2019 ఎన్నికల మాదిరిగానే 2024 ఎన్నికలను టార్గెట్ చేసుకుని సరికొత్త నినాదాన్ని  సోషల్ మీడియాలో మొదలుపెట్టింది.#YSRCPAGAIN2024 హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ ( Twitter )లో ట్రెండింగ్ చేస్తోంది.దీనిని మొదలుపెట్టిన కొద్దిసేపట్లోనే ట్రెండింగ్ లోకి వచ్చింది.

సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యే విధంగా వైసిపి సోషల్ మీడియా మొదలుపెట్టిన ఈ యాష్ ట్యాగ్ స్లోగన్ వైరల్ అవుతోంది.ఈ హ్యాష్ ట్యాగ్ కింద జగన్ పాదయాత్ర, ప్రమాణస్వీకారం, నవరత్నాలు, పాలనపరమైన నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇలా అనేక వాటిపై వరుసగా కామెంట్ లు చేస్తూ, తమ అభిమానాన్ని చాటుకుంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రచారం ట్రెండింగ్ లో నిలవడంతో వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలలోను కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసిపి సోషల్ మీడియా విభాగాన్ని మరింతగా బలోపేతం చేయడం, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలకు తగిన సూచనలు చేస్తూ, తన మార్క్ కనిపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Sajjala Bhargav, Telugudesam, Ysrcp-Telugu Political New

 ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్  తో జగన్ సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది.ఈ హ్యాష్ ట్యాగ్ ఇంతగా ట్రెండింగ్ లోకి రావడంతో జగన్ కు ఇంత ఫాలోయింగ్ ఉందా.? అంటూ ప్రత్యర్థుల సైతం  ఆశ్చర్యపోయే విధంగా వైసిపి సోషల్ మీడియా విభాగం దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube