దేవుడే చిరంజీవి రూపంలో వచ్చిన ప్రాణాలు కాపాడారు: నటుడు పొన్నంబలం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఓ మంచి మనసున్న వ్యక్తి అని కూడా నిరూపించుకున్నారు.

 God Saved Lives In The Form Of Chiranjeevi Actor Ponnambalam Details, Chiranjeev-TeluguStop.com

చిరంజీవి ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తూ తన మంచితనాన్ని మానవత్వాన్ని కూడా చాటుకున్నారు.ఇలా ఎంతోమందికి సహాయం చేసిన చిరంజీవి ఏనాడు తన సహాయం గురించి బయటకు చెప్పుకోలేదు.

చిరంజీవి గారి నుంచి సహాయం పొందిన వారే ఆయన చేసిన సహాయ సహకారాలను బయటకు చెబితే తప్ప ఎవరికి కూడా ఆయన చేసిన సహాయం తెలియదు.అయితే తమిళ నటుడు పొన్నంబలం(Ponnam Balam) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండగా చిరంజీవి తనని ఆదుకొని దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి తన ప్రాణాలను కాపాడారని గత ఇంటర్వ్యూలో తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నటువంటి పొన్నంబలం చిరంజీవి గురించి మరోసారి ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా తన వల్లే నేను బ్రతికి ఉన్నానని చెప్పారు.

Telugu Chiranjeevi, Chiruponnam, Lordanjaneya, Ponnamchiru, Ponnam Balam, Tollyw

ఈ సందర్భంగా పొన్నంబలం మాట్లాడుతూ తన కిడ్నీస్ ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ చేసుకుంటున్నాను.అయితే అప్పటికి డబ్బులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని తెలియజేశారు.ఇక తన అల్లుడు తనని ఆంజనేయస్వామి (Lord Anjaneya Temple) గుడికి తీసుకెళ్లి పూజ చేయించారు.

ఆ సమయంలో పూజారి చిరంజీవి (Chiranjeevi)అని పలకడంతో నాకు వెంటనే చిరంజీవి గారిని సహాయం అడగాలన్న ఆలోచన వచ్చిందని పొన్నంబలం తెలిపారు.స్నేహితుడి సహాయంతో చిరంజీవి గారి నెంబర్ తీసుకొని తనని కాంటాక్ట్ అయ్యాను.

ఆయన నాకు సహాయం చేస్తాను అని చెప్పారు.ఆ సహాయమంటే రెండు మూడు లక్షలు సహాయం చేస్తారేమో అనుకున్నాను కానీ ఏకంగా 40 లక్షల రూపాయల సహాయం చేసిన ప్రాణాలు కాపాడారని నిజంగా ఆ దేవుడే చిరంజీవి రూపంలో వచ్చి నన్ను బ్రతికించాడని ఈ సందర్భంగా పొన్నంబలం చిరంజీవి గురించి చెబుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube