నాన్న వల్ల ఎన్నో సినిమా అవకాశాలు కోల్పోయాను... వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్ వైరల్!

ఛాలెంజింగ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారినటువంటి లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కెరియర్ మొదట్లో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఈమె విలన్ పాత్రలకు అద్భుతంగా సెట్ కావడంతో విలన్ పాత్రలలోని ఎక్కువగా నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

 I Lost Many Film Opportunities Because Of My Father Details,varalakshmi Sarath K-TeluguStop.com

తెలుగులో ఈమె నటించిన క్రాక్(Crack) సినిమాలో జయమ్మ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ పాత్ర ద్వారా ఈమెకు ఎంతో మంచి పేరు రావడంతో తెలుగులో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.

Telugu Jeniliya, Sarath Kumar-Movie

తాజాగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన విలనిజంతో అందరిని ఆకట్టుకున్నారు.ఇలా వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపిన వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వృత్తిపరమైన జీవితం గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.నటిగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సమయంలో తాను ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చానని తెలిపారు.

అయితే నాన్న తనని సినిమాలలోకి నిరాకరించటం వల్ల మంచి అవకాశాలను కోల్పోయానని తెలియజేశారు.

Telugu Jeniliya, Sarath Kumar-Movie

నాన్న ఇండస్ట్రీలోకి రావడానికి వ్యతిరేకి కాదు కానీ చదువు పూర్తి చేసిన తర్వాతనే నటన వైపు అడుగులు వేయాలన్నది నాన్న ఆలోచన.అందుకే నాకు మంచి సినిమా అవకాశాలు వచ్చినా కూడా ఆయన నిరాకరించడం వల్ల ఎన్నో గొప్ప సినిమా అవకాశాలను కోల్పోయానని వరలక్ష్మి శరత్ కుమార్ తెలియజేశారు.శంకర్ (Shankar)దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్(Boys) సినిమాలో జెనీలియా (Jeniliya) పాత్రలో నేనే నటించాల్సి ఉందని కానీ నాన్న ఒప్పుకొని కారణంగా ఈ అవకాశాన్ని కోల్పోయానని తెలియజేశారు.

ఈ పాత్ర కోసం తాను ఆడిషన్ ఇవ్వడమే కాకుండా స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తి అయిందని అయితే నాన్న ఒప్పుకోని కారణంగానే ఈ సినిమాని మిస్ చేసుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube