'దళపతి 68' నుండి లేటెస్ట్ అప్డేట్.. ఆ స్టార్ కూడా భాగం కానున్నారట!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ (Vijay Thalapathy) ఒకరు.ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ”లియో” (Leo) సినిమా చేస్తున్నాడు.

 This Actor To Lock Horns With Vijay Thalapathy 68 Details, Vijay Thalapathy, Tha-TeluguStop.com

ఈ సినిమా షూట్ ”వారిసు” రిలీజ్ కాగానే స్టార్ట్ చేయగా ఇప్పటికే 80 శాతానికి పైగానే పూర్తి చేసారు.అందుకే అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.

మరి ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన 68వ (Thalapathy 68) సినిమాను విజయ్ కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో చేయనున్నాడు అని నిన్న అధికారిక ప్రకటన వచ్చింది.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

మొన్నటి నుండి అధికారిక ప్రకటన వస్తుంది అని ఊరిస్తున్న కోలీవుడ్ లో ఉన్న విజయ్ ఫ్యాన్స్ కు నిన్నటితో ఎగ్జైట్మెంట్ తీరిపోయింది.ఇది అధికారిక ప్రకటన రావడంతో ఈ సినిమా నుండి ఇక ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తుంది.ఈ సినిమాలో మరో స్టార్ నటుడు భాగం కానున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.

కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య (SJ Suryah) కూడా విలన్ పాత్ర పోషించ బోతున్నట్టు సమాచారం.

కాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు అతి త్వరలోనే మేకర్స్ అధికారికంగా వెల్లడి చేయనున్నారు.ఇక ఈ సినిమాను ఆగస్టు లో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ అప్పుడే ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube