ఇదేం పిచ్చి.. నుదుటిపై భర్త పేరును పచ్చబొట్టు పొడిపించుకున్న భార్య..

సాధారణంగా ప్రేమించే వ్యక్తుల పేర్లను శరీరంపై పచ్చబొట్లు( Tattoos )గా పొడిపించుకోవడం మనం చూస్తూనే ఉంటాం.మామూలుగా ముఖంపై తప్ప చేతి, ఛాతి లేదా ఇంకా వేరే ప్రదేశాల్లో పచ్చబొట్టును పొడిపించుకుంటారు.

 Woman From Bengaluru Tattoos Husband's Name On Forehead,tattoo, Love, Relationsh-TeluguStop.com

అయితే తాజాగా ఒక భార్య తన భర్త పేరును నుదుటిపై వేయించుకొని షాక్ ఇచ్చింది.ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఒక వీడియోలో ఈ దృశ్యం కనిపించింది.

దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఒక మహిళ తన భర్తపై తన ప్రేమను చూపించాలని ఆ వింత నిర్ణయం తీసుకుంది.

ఆమె బెంగుళూరులోని కింగ్ మేకర్ టాటూ స్టూడియో( King Maker tattoo Studio )ని సందర్శించింది.అక్కడ తన భర్త పేరు “సతీష్” అని తన నుదుటిపై టాటూ వేయించుకుంది.టాటూ ఆర్టిస్ట్ ఒక కాగితంపై పేరు రాసి, ఫాంట్ సైజును గుర్తించేందుకు దానిని మహిళ నుదిటిపై అతికించడంతో వీడియో ప్రారంభమవుతుంది.సదరు భార్య మొదట్లో పచ్చబొట్టు వేయించుకోవడం పట్ల ఉత్సాహంగా కనిపిస్తుంది.

కాగా టాటూ ఆర్టిస్ట్ తన నుదిటిపై పేరును( Forehead Name ) పచ్చబొట్టు పొడిచే ప్రక్రియను ప్రారంభించినప్పుడు, అసౌకర్యానికి గురవుతుంది.ఆమె తన అసౌకర్యాన్ని కళాకారుడికి తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది, అయితే పచ్చబొట్టు వేయడం అతను కంటిన్యూ చేస్తాడు.

ఈ వీడియోను టాటూ స్టూడియో “ట్రూ లవ్”( True Love ) అనే టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.షేర్ చేసిన వెంటనే ఇది వైరల్ అయింది.

కోటికి పైగా వ్యూస్ 3 లక్షల వరకు లైకులు దీనికి వచ్చాయి.

నుదిటిపై పచ్చబొట్టు ఇలా పొడిపించుకోవడం ఎంతవరకు కరెక్ట్?? ఇది పిచ్చా లేక ఇంకేమైనా? అని చాలా మందిని సదరు భార్యను తిట్టిపోస్తున్నారు.ప్రేమను ఏ రూపంలోనైనా చూపించవచ్చని, ఇలా నుదిటిపై టాటూ వేయించుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube