ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి.ఇప్పటికే అధికార వైసీపీ( YCP ) టార్గెట్ 175 అంటుంటే.
ప్రతిపక్ష టీడీపీ( TDP ) టార్గెట్ 160 అంటోంది.దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ లక్ష్యాన్ని చేరుకోనుంది అనే చర్చ జోరుగా సాగుతోంది.
గత ఎన్నికల్లో 151 సీట్లతో సంచలన విజయం సాధించి ఈ సారి అంతకు మించి అనేలా 175 సీట్లను క్లీన్ స్వీప్ చేస్తానంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress Party ).ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy )అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, తాము చేసిన మంచే తమకు అధికారాన్ని కట్టబెడుతుందని వైఎస్ జగన్ ప్రతిసారి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అందుకే వైనాట్ 175 అంటున్నారు.అటు టీడీపీ గత ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూసింది.ఆ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి బయటపడడం టీడీపీకి సవాలే.అయితే జగన్ ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతనే ప్రధాన అస్త్రంగా వాడుకుంటుంది టీడీపీ.అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే పార్టీకి మైలేజ్ తెచ్చేందుకు విశ్వ ప్రయత్నలే చూస్తున్నారు చంద్రబాబు అండ్ కొ( Chandrababu and co ).ఆ దిశగా కొంత సక్సస్ కూడా అయ్యారనే చేపవచ్చు.జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి ఏ స్థాయిలో ప్లెస్ అయిందో ఆ మద్య జరిగిన పట్టభధ్రుల ఎన్నికలే నిరూపించాయి.దాంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ వైపు నిలుస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని టీడీపీ వర్గం గట్టిగా నమ్ముతోంది.

అందుకే టార్గెట్ 160 అంటోంది.160 స్థానాల్లో టీడీపీ విజయం సాధించడం పక్కా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పదే పదే చెబుతున్నారు.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీని నిలువరించి టీడీపీ 160 సీట్లు సాధించగలదా అంటే విశ్లేషకుల నుంచి సమాధానం తటస్థంగా వినిపిస్తోంది.అయితే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 160 సీట్లు కష్టమే అనే సమాధానం వినిపిస్తుండగా.
ఒకవేళ జనసేన పార్టీని( Janasena party ) కలుపుకొని ఎన్నికల బరిలోకి దిగితే 160 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది కొందరి మాట.అయితే ఇప్పటికే టీడీపీ జనసేన మద్య పొత్తు దాదాపు కన్ఫర్మ్ అయినట్టే.అందుకే టీడీపీ శ్రేణులు 160 టార్గెట్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.మరి టీడీపీ టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.








