ఈ ఐపీఎల్( IPL ) సీజన్ చివరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్ శుబ్ మన్ గిల్( Shubman Gill ) చెలరేగి సెంచరీ చేయడంతో బెంగుళూరు ( RCB )ఘోర ఓటమిని చవిచూసి ప్లే ఆఫ్ రేస్ నుండి నిష్క్రమించి ఇంటి ముఖం పట్టింది.దీంతో ముంబై జట్టు నేరుగా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ముంబై ఫ్యాన్స్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాదు మరొకవైపు సచిన్ టెండూల్కర్( Sachin tendulkar ) కూతురు సారా టెండూల్కర్( Sara tendulkar ) ట్విట్టర్ లో ఫ్యాన్ పేజీలో శుబ్ మన్ గిల్ కు ధన్యవాదములు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టింది.ఈ హ్యాష్ ట్యాగ్ ను కూడా ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు.అయితే గతంలో శుబ్ మన్ గిల్ కు సారా టెండూల్కర్ కు మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని.
ఇద్దరు కలిసి డేటింగ్ కు కూడా వెళ్లారని రూమర్లు చాలానే వచ్చాయి.ఎట్టకేలకు ముంబై ను ప్లే ఆఫ్ కు చేర్చావు అంటూ సారా టెండూల్కర్ ను పెళ్లి చేసుకో అంటూ చాలామంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొంతమంది క్రికెట్ దేవుడికి నువ్వే సరైన అల్లుడివి పెళ్లి చేసుకుని సచిన్ ఇంటికి అల్లుడువి కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరొక విషయం ఏమిటంటే గిల్ ను చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశావని స్వయంగా సచిన్ టెండుల్కర్ అతనిని అభినందించాడు.దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ముంబై ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ప్రేక్షకులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.లక్ష్య చేదనకు దిగిన గుజరాత్ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి విజయం సాధించింది.







