Tollywood Heroines : సైడ్ బిజినెస్ తో బాగా సంపాదిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్.. ఇంతకు వాళ్లేవ్వరంటే?

ఈ మధ్యకాలంలో చాలామంది సైడ్ బిజినెస్లకు బాగా అలవాటు పడుతున్నారు.కాస్త సమయం దొరికితే చాలు ఏదో ఒక వ్యాపారం పెట్టి మరింత సంపాదించాలని అనుకుంటున్నారు.

 Tollywood Heroines Are Earning Well With Side Business-TeluguStop.com

ఇక ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు మాత్రం ఈ సైడ్ బిజినెస్లకు బాగా అలవాటు పడుతున్నారు.సినిమాల పరంగా సంపాదించిన డబ్బుతో పెట్టుబడి పెట్టి వ్యాపారాలు ప్రారంభించి రెట్టింపు డబ్బు సంపాదిస్తున్నారు.

ఇప్పుడైతే టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు పలు రకాల వ్యాపారాలు ప్రారంభించి బాగా సంపాదించుకుంటూ పోతున్నారు.ఎక్కువగా ఫుడ్ కు సంబంధించిన బిజినెస్ లను పెట్టారు.

అయితే హీరోలు కాకుండా కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా సైడ్ బిజినెస్ లు చేస్తున్నారు.ఇప్పటికే సమంత దుస్తులకు సంబంధించిన బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే సమంతతో పాటు మరికొంతమంది హీరోయిన్లు కూడా సైడ్ బిజినెస్ లు చేస్తున్నారు.ఇంతకు ఆ హీరోయిన్లు ఎవరు.

వాళ్ళు చేస్తున్న బిజినెస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కీర్తి సురేష్: మహానటి ఫేమ్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి, ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదా లోకి చేరుకుంది.మహానటి సావిత్రి సినిమాతో ఈమె క్రేజ్ బాగా పెరిగిపోయింది.ఇక ఇటీవలే దసరా మూవీలో వెన్నెల పాత్రతో మరింత ఫిదా చేసింది.అయితే కీర్తి సురేష్ కేవలం సినిమాల పరంగానే కాకుండా వ్యాపారంలో కూడా బాగా సంపాదిస్తుంది.

ఇక ఈమె భూమిత్ర ( Bhumitra )పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ ను నడిపిస్తుంది.

కాజల్ అగర్వాల్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి స్టార్ హోదా సొంతం చేసుకుంది.ఇక పెళ్లయి బాబు పుట్టాక కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వట్లేదు ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈమె తన చెల్లి నిషా అగర్వాల్ తో కలిసి ఒక ఫ్యాషన్ జ్యువెలర్స్ బిజినెస్( Fashion Jewelers Business ) ను ప్రారంభించింది.

ఇలియానా: గోవా బ్యూటీ ఇలియానా( Ileana ) టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం.తన అందాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.కొంతకాలం కిందట టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం కాగా బాలీవుడ్ సెటిల్ అయింది.ఇక ఈ బ్యూటీ పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని రీసెంట్ గా తనే షేర్ చేసుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ గోవాలో రెస్టారెంట్లు, బేకరీలు రన్ చేస్తూ బాగా సంపాదించుకుంటూ పోతుంది.

Telugu Actressrakul, Actressshruti, Bhumitra, Jewelers, Ileana, Kajal Agarwal, K

రకుల్ ప్రీత్ సింగ్: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం ఏర్పరచుకోగా ఇప్పుడు టాలీవుడ్ కు దూరమై బాలీవుడ్ లో సెటిల్ అయింది.అక్కడే వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీ బిజీగా మారింది.ఇక ఈ బ్యూటీ కూడా సొంతంగా ఫిట్నెస్ హెల్త్ కు సంబంధించిన జిమ్ సెంటర్( Gym Center ) ను రన్ చేస్తున్నట్లు తెలిసింది.

Telugu Actressrakul, Actressshruti, Bhumitra, Jewelers, Ileana, Kajal Agarwal, K

తమన్నా: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి అభిమానం సంపాదించుకుంది.ఈ బ్యూటీ కూడా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా మారింది.ఇక తమన్నా కూడా వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెలరీ( Jewelery white and gold ) బ్రాండ్ ను రన్ చేస్తుంది.

Telugu Actressrakul, Actressshruti, Bhumitra, Jewelers, Ileana, Kajal Agarwal, K

శృతిహాసన్: కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ టాలీవుడ్ లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ కూతురుగా పేరు సంపాదించుకుంది.స్టార్ హీరోలతో చేసి స్టార్ హోదా సొంతం చేసుకుంది శృతిహాసన్.ఇక ఈ ముద్దుగుమ్మ కూడా సినిమాల పరంగా కాకుండా సైడ్ బిజినెస్ లు కూడా చేస్తుంది.

సొంతంగా ప్రొడక్షన్ హౌస్, యానిమేషన్ ఫిలిం, వీడియో రికార్డింగ్ సంస్థను స్థాపించి బాగా సంపాదిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube