దేశవ్యాప్తంగా రూ.2 వేల నోటు రద్దు( 2000 Rupees Notes Ban ) విషయం సంచలనంగా మారింది.మోడీ నిర్ణయం పట్ల రాజకీయ నేతలు, సెలబ్రిటీలు సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలను గుప్పిస్తున్నాయి.కాగా డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం రూ.2 వేల నోట్ల రూపాయల రద్దుపై సోషల్ మీడియా( Social Media )లో ఒక రేంజ్‌లో ట్రోల్స్, మీమ్స్ నడుస్తున్నాయి.కాగా గతంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగా తాజా నిర్ణయంపై మాత్రం పెద్దగా స్పందించడం లేదు.

కారణం ప్రస్తుతం 2 వేల నోట్ల ఎక్కువగా చెలామణిలో లేవు.కేవలం 10.8 శాతం నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు( Manchu Vishnu ) చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ టాప్ కమెడియన్ ఇంట్లో 2 వేల రూపాయల నోట్ల కట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి అంటూ ఒక ఫొటో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.కాగా ఆ టాలీవుడ్ కమెడియన్ మరెవరో కాదు కమెడియన్ వెన్నెల కిషోర్ ( Comedian Vennela Kishore )ఇంట్లో కుప్పలు కుప్పలుగా రూ.2 వేల నోట్లు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.అంతేకాక ఒక ఫొటోని కూడా షేర్ చేశారు.
ఆ ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ తీసిన ఫొటో.ఆయన ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.

ఇప్పుడు ఆయన వీటిని ఏం చేస్తాడో అంటూ ట్వీట్ చేశారు మంచు విష్ణు.కాగా హీరో మంచు విష్ణు ట్వీట్ పై వెన్నెల కిశోర్ స్పందించారు.హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్ ను చంపేసినట్లు, నా మీద పడ్డారేంటి? అంటూ ఆహుతి ప్రసాద్ చెప్పిన డైలాగ్‌ను పోస్టు చేశారు.ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్ వైరల్ గా మారింది.
కాగా ఈ ట్వీట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.







