తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు చేరికలపైనే ఆశలు పెట్టుకున్నాయి. పెద్ద ఎత్తున ఇతర పార్టీలోని నేతలను చేర్చుకుని బలమైన పార్టీగా తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపించాలనే పట్టుదలతో ఉన్నాయి.
అందుకే ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలను గుర్తించి వారితో మంతనాలు చేసి తమ పార్టీలో చేరే విధంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ విషయంలో బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా ఎవరికి వారు ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నారు .అధికార పార్టీ బి ఆర్ ఎస్ లో( BRS ) అసంతృప్తులు ఎక్కువగా ఉండడంతో, బిజెపి కాంగ్రెస్ లు వారిపై దృష్టి సారించాయి.ముఖ్యంగా బిజెపి ( BJP ) ఈ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తోంది.
తమ పార్టీలో చేరితే రాబోయే రోజుల్లో రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని, కేంద్రంలోనూ మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ స్థాయిలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామనే హామీలు ఇస్తూ కీలక నాయకులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుండగా, కాంగ్రెస్ ( Congress ) సైతం ఇదేవిధంగా హామీలు ఇస్తోంది.

ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో, ఆ ఉత్సాహంతో తెలంగాణపై ఫోకస్ చేసింది.అలాగే బీజేపీ , బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడం, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ధీమాను ప్రదర్శిస్తూ వస్తోంది.ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా ఆ పార్టీ భావిస్తోంది .ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వంటి నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని , బిజెపి లో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలంతా మళ్ళీ వెనక్కి వస్తారని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీని వీడిన వారంతా వెనక్కి రావాలని, పార్టీలో వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని మీకు ఏ ఇబ్బంది కలగకుండా తాను వ్యవహరిస్తానని హామీ ఇస్తూ, వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ, తమ పార్టీలో చేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.అన్ని నియోజకవర్గాల్లో బిజెపి, కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలను గుర్తించి వారితో మంతనాలు చేస్తూ బిఆర్ఎస్ లో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.ఈ విధంగా అన్ని పార్టీలు చేరికలపైనే ఎక్కువ ఫోకస్ చేశాయి.
మరికొద్ది నెలలో జరగనున్న ఎన్నికల్లో గట్టెక్కేందుకు చేరికలపైనే అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి.







