ఈ 4 కంపెనీల బైక్స్ కొనుగోలు చేస్తే.. బతుకు భారమే..!

మోటార్‌సైకిల్ కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్‌ల విశ్వసనీయత తెలుసుకోవడం చాలా ముఖ్యం.అంటే ఒక బ్రాండ్‌పై మనకి కొండంత విశ్వాసం ఉండాలి.

 These Are The Least Reliable Motorcycle Brands In India Details, Motorcycle Bran-TeluguStop.com

ఆ బ్రాండ్‌కి చెందిన బైక్ కొనుగోలు చేస్తే రిపేర్లు, మెయింటెనెన్స్ ఖర్చులు పెద్దగా ఉండకూడదు.బైక్ అనవసరంగా మన సమయాన్ని వృధా చేయకూడదు.

రైడింగ్ చేసేటప్పుడు భద్రత, మనశ్శాంతిని కూడా అందించాలి.హోండా, హీరో వంటి ప్రముఖ బ్రాండ్‌ల బైక్‌లు, స్కూటర్లు చాలా విశ్వసనీయతను కలిగి ఉంటాయి.

ఈ కంపెనీల మోడల్స్ వేరైనా వాటి తయారీ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలు, డిజైన్ సూత్రాలు అన్ని ఒకేలా ఉంటాయి.యూజర్ రివ్యూస్ ఆధారంగా బ్రాండ్ విశ్వసనీయతను కొనుగోలుదారులు అంచనా వేయవచ్చు.

ప్రస్తుతం ఇండియాలో 4 ఫేమస్ బ్రాండ్‌లకు చెందిన బైక్స్ కొన్ని సమస్యలతో కొనుగోలు చేసిన వారిని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

*

కేటీఎమ్:

KTM స్ట్రీట్ అడ్వెంచర్ బైక్‌లకు ప్రసిద్ధి చెందింది.ఆస్ట్రియా, స్పెయిన్, భారతదేశంలో ఫ్యాక్టరీలను కలిగి ఉంది.ఈ బైక్‌లకు సంబంధించిన సమస్యలలో ABS లోపాలు, ఫ్యూయల్ పంప్ సమస్యలు, ఆయిల్ లీక్‌లు, సస్పెన్షన్ సమస్యలు ఉన్నాయి.హార్డ్ రైడింగ్, ఆఫ్-రోడ్ ఉపయోగం కోసం రూపొందించిన బైక్‌లలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక చౌకైన మోడల్స్‌ తక్కువ ఫిట్, ఫినిషింగ్ కలిగి ఉండవచ్చు.

*

రాయల్ ఎన్‌ఫీల్డ్:

రాయల్ ఎన్‌ఫీల్డ్( Royal Enfield ) గతంలో విశ్వసనీయత లేనిదిగా పేరు తెచ్చుకుంది కానీ ఇటీవలి మోడళ్లతో మెరుగుపడింది.కొత్త యూకే-ఆధారిత డిజైన్ బృందంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT, ఇంటర్‌సెప్టర్, హిమాలయన్ ADV వంటి మంచి మోడళ్లను పరిచయం చేసింది.కానీ మునుపటి జనరేషన్ బైక్‌లకు ఆయిల్ లీక్‌ల సమస్యలు ఉన్నాయి.

పేలవమైన సర్వీస్ అనేది ఈ సమస్యను మరింత పెంచింది.అయితే తక్కువ ధరలతో రాయల్ ఎన్‌ఫీల్డ్ పాపులారిటీ పొందింది.

*

డుకాటి:

డుకాటి మోటార్‌సైకిళ్లు( Ducati ) హై-పర్ఫామెన్స్‌తో బాగా పాపులర్ అయ్యాయి.కానీ ఇతర బ్రాండ్‌ల కంటే తక్కువ విశ్వసనీయమైనదిగా పేరు తెచ్చుకున్నాయి.ఈ మోటార్‌సైకిళ్లలో ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంకుల వాపు, విద్యుత్ వ్యవస్థలు, డెస్మోడ్రోమిక్ వాల్వ్ వ్యవస్థతో సమస్యలు ఉన్నాయి.కాగా సరైన జాగ్రత్తలు తీసుకుంటే, డుకాటి మోటార్‌సైకిళ్లు ఎక్కువ కాలం మన్నుతాయి.

*

హార్లే-డేవిడ్‌సన్‌:

హార్లే-డేవిడ్‌సన్‌ బైక్‌లు( Harley Davidson ) రిపేర్ చేయడం చాలా సులభం.ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి.అయితే వైబ్రేషన్స్, వదులుగా ఉండే బోల్ట్‌లు, చమురు లీక్‌లు కాలక్రమేణా సంభవించవచ్చు.దీనివల్ల పదేపదే రిపేర్ చేయించుకోవాల్సిన తలనొప్పులు కలుగుతాయి.

Least Reliable Motorcycle Brands in India

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube